తెలంగాణలోని మంచిర్యాల జిల్లాలో ఎమ్మెల్సీ కవిత శుక్రవారం పర్యటించారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ 'నాకు సొంత అజెండా ఏమీలేదు. పార్టీని కాపాడుకోవాలనేది నా తపన. బీజేపీలో పార్టీని విలీనం చేయొద్దనేది నా వాదన. బీజేపీతో పొత్తు పెట్టుకున్న ఏ పార్టీ బాగుపడలేదు. నేను జైల్లో ఉన్నప్పుడు పార్టీని బీజేపీలో కలుపుతానని అన్నారు. పార్టీని బీజేపీలో కలుపుతానంటే నేను ఒప్పుకోను. లెటర్ రాయడంలో నా తప్పేమీ లేదు. లెటర్ బయటపెట్టిన వారిని పట్టుకోండి' అని వ్యాఖ్యానించారు.
నాకు సొంత అజెండా ఏమీలేదు - పార్టీని కాపాడుకోవాలనేది నా తపన: ఎమ్మెల్సీ కవిత
May 30, 2025
0
Tags