వామపక్ష భావజాలం గల విద్యార్థులకు ఆవాసంగా మారుతున్న హార్వర్డ్ యూనివర్శిటీ

Telugu Lo Computer
0


మెరికాలోని వైట్ హౌస్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మాట్లాడుతూ హార్వర్డ్ యూనివర్శిటీపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. అక్కడి పరిపాలన విధానం, అడ్మిషన్ల ప్రక్రియపై విమర్శలు చేశారు. విదేశీ విద్యార్థులకు ప్రాధాన్యత ఇవ్వడాన్నీ తప్పుపట్టారు. హార్వర్డ్‌లో చేరిన చాలామంది విదేశీ విద్యార్థులు ట్రబుల్ మేకర్స్ గా అభివర్ణించారు. దేశాన్ని అస్తవ్యస్తం చేస్తోన్నారని మండిపడ్డారు. అమెరికా షాపింగ్ సెంటర్ గా మారుతోందని వ్యాఖ్యానించారు. షాపింగ్ కేంద్రాలు విదేశీ విద్యార్థులతో నిండిపోవడాన్ని చూడాలనుకోవట్లేదని తేల్చి చెప్పారు. రాడికల్, వామపక్ష భావజాలంతో అల్లర్లకు కారణమౌతోన్నారంటూ ఆరోపించారు. హార్వర్డ్ యూనివర్శిటీ ప్రతి సంవత్సరం దాదాపు 31 శాతం మంది విదేశీ విద్యార్థులను చేర్చుకుంటుందని, వారిలో కొందరు రాడికలైజ్డ్ ప్రాంతాల నుండి వచ్చారని డొనాల్డ్ ట్రంప్ పేర్కొన్నారు. విదేశీ విద్యార్థుల కోసం 31 శాతం కోటా ఎందుకు? అని ప్రశ్నించారు. 15 శాతం చాలని భావిస్తున్నానని అన్నారు. హార్వర్డ్, ఇతర విద్యాసంస్థల్లో అడ్మిషన్లు పొందాలనుకునే సొంత దేశ విద్యార్థులు చాలామంది ఉన్నారని, విదేశీ విద్యార్థుల కోటా అధికంగా ఉన్నందున వాళ్లకు ఆ అవకాశం దక్కట్లేదని చెప్పారు. ఏ దేశానికి చెందిన విద్యార్థి అయినా సరే అమెరికాను ప్రేమించాలని సూచించారు. విదేశీ విద్యార్థుల గురించి ఆరా తీయాలనే ఉద్దేశంతోనే వారి రికార్డులు ప్రభుత్వానికి అందజేయాలని ఆదేశించినట్లు ట్రంప్ ఓ ప్రశ్నకు బదులిచ్చారు. ఎక్కడి నుంచో వచ్చిన వామపక్ష భావజాలం గల విద్యార్థులు మన దేశంలో ఇబ్బంది కలిగించడం తనకు ఎంతమాత్రమూ ఇష్టం లేదని స్పష్టం చేశారు. హార్వర్ యూనివర్శిటీ ఓ యాంటీ సెమిటిక్ గా వ్యవహరిస్తోందని ట్రంప్ ధ్వజమెత్తారు. ఓ గ్రేట్ డిజాస్టర్ గా మారుతోందనీ విమర్శించారు. కొన్ని కాలేజీలు కూడా ఇలాగే తయారవుతున్నాయని, వాటిని నియంత్రించాల్సిన అవసరం ఉందని చెప్పారు. హర్వర్డ్ ప్రతి సంవత్సరం అయిదు బిలియన్ డాలర్లకు పైగా నిధులను ప్రభుత్వం నుంచి తీసుకుంటోందని, దీనికి తగ్గట్లుగా మలచుకోవట్లేదని వ్యాఖ్యానించారు. హర్వర్డ్ సహా ఆయా కాలేజీలు, యూనివర్శిటీలకు ఇచ్చి నిధులను ఏవైనా ట్రేడ్ స్కూల్స్ కోసం ఖర్చు పెడితే మంచి ఫలితాలు వస్తాయని డొనాల్డ్ ట్రంప్ చెప్పారు.

Post a Comment

0Comments

Post a Comment (0)