తెలంగాణ లోని వికారాబాదు జిల్లా కులకచర్ల పెద్ద గేటు చౌరస్తాలో రెట్రో సినిమా ఫ్రీ రిలీజ్ సందర్భంగా విజయ్ దేవర కొండ గిరిజన ప్రజల మనోభావాలను దెబ్బతీసేవిధంగా మాట్లాడటం పట్ల గిరిజన విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో సోమవారం నిరసన వ్యక్తం చేశారు. అనంతరం కులకచర్ల పోలీస్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా గిరిజన విద్యార్థి సంఘం వికారాబాద్ జిల్లా అధ్యక్షుడు రాథోడ్ శ్రీనివాస్‌నాయక్ మాట్లాడుతూ గిరిజనులపై అనుచితంగా మాట్లాడిన విజయ్ దేవరకొండపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసును నమోదు చేసి అరెస్టు చేయాలని డిమాండు చేశారు. ఐదు వందల సంవత్సరాల కిందట గిరిజనులు బుద్ధి లేకుండా కొట్టుకున్నారనే వ్యాఖ్యలు సరికాదని అన్నారు. ఎస్టీలకు క్షమాపణ చెప్పడంతో పాటు గిరిజనుల ఆరాధ్యదైవమైన సంత్‌సేవాలాల్ మహారాజ్ పాదాలమీద పడి క్షమాపణ కోరాలని డిమాండ్ చేశారు.
విజయ్ దేవరకొండపై కులకచర్ల పోలీస్టేషన్‌లో ఫిర్యాదు
May 05, 2025
0
Tags