మన గ్రహచారం బాగోలేక రేవంత్‌రెడ్డి తెలంగాణ ముఖ్యమంత్రి అయ్యారు : ఎమ్మెల్సీ కవిత

Telugu Lo Computer
0


హైదరాబాద్ లోని బంజారాహిల్స్‌లో తెలంగాణ జాగృతి నూతన కార్యాలయాన్ని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ప్రారంభించింది. అనంతరం మీడియాతో మాట్లాడుతూ రేవంత్‌రెడ్డిపై కీలక వ్యాఖ్యలు చేశారు. ''మన ఖర్మేంటంటే ప్రస్తుత ముఖ్యమంత్రి జై తెలంగాణ అని కూడా అనరు. మన గ్రహచారం బాగోలేక రేవంత్‌రెడ్డి తెలంగాణ ముఖ్యమంత్రి అయ్యారు. ఉద్యమకారులపై గన్‌ పట్టుకుని వెళ్లిన వ్యక్తి ముఖ్యమంత్రి అయ్యారు. జూన్ 2న రాష్ట్ర అవతరణ దినోత్సవం వస్తోంది. ఆ రోజైనా అమరవీరులకు ముఖ్యమంత్రి నివాళులర్పించాలి. రేవంత్‌రెడ్డి పక్క రాష్ట్ర ప్రయోజనాల కోసం పని చేస్తున్నారు. పక్క రాష్ట్ర ప్రాజెక్ట్‌లు కడుతుంటే ఏం చేస్తున్నారు. జూన్ 2 రాజీవ్ యువ వికాసం పేరుతో పథకం ప్రారంభిస్తున్నారని తెలిసింది. పథకాలు తెలంగాణ యువ వికాసం పేరుతో ఉండాలి కానీ రాజీవ్ వికాసం పేరు మీద కాదు. తెలంగాణ కోసం పోరాడి రాష్ట్రాన్ని సాధించిన వ్యక్తికి నోటీసులిస్తారా? తెలంగాణ ప్రజలకు మేలు చేసినందుకు నోటీసు ఇస్తారా? కేసీఆర్‌కు నోటీసు ఇవ్వడంపై జూన్ 4న పెద్ద ఎత్తున రాష్ట్రంలో ఆందోళనలు చేపడుతున్నాం.'' అని కవిత తెలిపారు. శనివారం సాయంత్రం తెలంగాణ జాగృతి నూతన కార్యాలయాన్ని ఎమ్మెల్సీ కవిత ప్రారంభించారు. బంజారాహిల్స్‌లోని నూతన కార్యాలయంలో ప్రత్యేక పూజలు చేసి ప్రారంభించారు. కవిత వెంట భర్త ఉన్నారు. భర్తతో కలిసి ఈ కార్యాలయాన్ని ప్రారంభించారు. నూతన కార్యాలయంలో కేసీఆర్, కవిత ఫొటోలు ప్రత్యేకంగా పెట్టారు. ఇక తెలంగాణ జాగృతి బ్యానర్‌లో ప్రొఫెసర్ జయశంకర్, కేసీఆర్ చిత్రాలు ఉన్నాయి. అలాగే కార్యాలయంలో బీఆర్. అంబేద్కర్, జయశంకర్, తెలంగాణ తల్లి, జ్యోతిబా ఫులే, సావిత్రిబాయి ఫులే విగ్రహాలతో పాటు అమరవీరుల స్థూపాన్ని ఏర్పాటు చేశారు.

Post a Comment

0Comments

Post a Comment (0)