కవిత లేఖలు బీజేపీకే లాభం : జగ్గారెడ్డి

Telugu Lo Computer
0


విత లేఖపై తెలంగాణ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి మాట్లాడుతూ కవిత డిప్రెషన్‌లో లేఖలు విడుదల చేసిందన్నారు. కవిత లేఖలతో కాంగ్రెస్‌కు వచ్చిన ఇబ్బందేమీ లేదని, కవిత చర్యలు బీజేపీ ప్రాధాన్యాన్ని పెంచుతున్నాయన్నారు. బీఆర్ఎస్ ను చంపడం, బతికించుకోవడం వాళ్ళ వ్యక్తిగతమని, కవిత లేఖ వల్ల బీఆర్ఎస్ ఓటు బ్యాంకు డిస్టర్బ్ అయిందని చెప్పుకొచ్చారు. కవిత వల్ల ఆ పార్టీ క్యాడర్ లీడర్స్ బీజేపీకి వెళ్లే అవకాశం ఉందన్నారు. కవిత తండ్రి చాటు బిడ్డగా లీడర్ అయిందని, కవిత డైరెక్ట్ లీడర్ కాదు, రాజకీయంగా బలవంతురాలు కాదని జగ్గారెడ్డి పేర్కొన్నారు. కేసీఆర్ కుటుంబంలో, పార్టీలో లేఖ కలకలం రేగిందన్నారు. ఏ రాజకీయ పార్టీలోనైనా అంతర్గత అంశాలు ఉంటాయన్నా జగ్గారెడ్డి.. కేసీఆర్ దేవుడు అంటూనే ఆయన్ని జీవ సమాధి చేసే ప్రయత్నం చేస్తున్నారన్నారు. రాష్ట్ర విభజన కోణంలోనే కేసీఆర్‌కు ప్రజలు పట్టం కట్టారని, తర్వాత.. అభివృద్ధిని చూసి కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టారని జగ్గారెడ్డి వ్యాఖ్యానించారు.ఏ చరిత్ర చూసుకున్నా కొడుకే వారసుడన్నారు. బీఆర్ఎస్ కార్యకర్తలను కన్ఫ్యూజ్ చేసి బీజేపీ బలం పెంచుతున్నారని కామెంట్స్ చేశారు. కవిత రాష్ట్ర రాజకీయాలపై ఎలాంటి ప్రభావం చూపించదని, కేసీఆర్ కూతురు కాబట్టే కవిత ఎపిసోడ్‌పై మీడియాకి ఆసక్తి అని స్పష్టం చేశారు. కవిత లేఖలు బీజేపీకే లాభమని వివరించారు.

Post a Comment

0Comments

Post a Comment (0)