లండన్ మేడమ్ టుస్సాడ్స్‌లో రామ్ చరణ్ మైనపు విగ్రహాన్ని స్వయంగా గ్లోబల్ స్టార్ చెర్రీ ఆవిష్కరించారు. విగ్రహంలో చరణ్ పెంపుడు కుక్క రైమ్ కూడా చోటుదక్కించుకుంది. ప్రభాస్, అల్లు అర్జున్ తర్వాత మేడమ్ టుస్సాడ్స్ లో మూడో టాలీవుడ్ నటుడిగా రామ్ చరణ్ విగ్రహం కొలువుదీరింది. కాగా, మహేశ్ బాబు విగ్రహం కూడా ఏర్పాటైన విషయం తెలిసిందే. బాలీవుడ్ ఇండస్ట్రీని టాలీవుడ్ బీట్ చేసింది. ఒకే ఇండస్ట్రీ నుంచి దాదాపు 4 నుంచి 5 వరకు మైనపు విగ్రహాలు ఏర్పాటయ్యాయి. అందులో తాజాగా మెగాపవర్ స్టార్ రాంచరణ్ కూడా మెంబర్ అయ్యారు.
తన విగ్రహాన్ని తానే ఆవిష్కరించుకున్న రాంచరణ్ !
May 11, 2025
0
Tags