సింధ్‌లో పాకిస్తాన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాజీ ప్రధాని బెనజీర్ భుట్టో కుమార్తె కాన్వాయ్‌ను చుట్టుముట్టి, కర్రలతో నిరసనకారులు దాడి చేయడానికి ప్రయత్నించారు. కరాచీ నుండి నవాబ్‌షాకు ప్రయాణిస్తున్న ఆసిఫా భుట్టో జర్దారీ కాన్వాయ్‌ను జంషోరో టోల్ ప్లాజా సమీపంలో నిరసనకారులు కొంతసేపు అడ్డుకున్నారు. కాలువ ప్రాజెక్టు, కార్పొరేట్ వ్యవసాయాన్ని వ్యతిరేకిస్తూ నిరసన తెలిపారు. స్థానిక మీడియా కథనాల ప్రకారం, భద్రతా దళాలు కాన్వాయ్‌ను సురక్షితంగా పంపించేశారు. ఇందుకు సంబంధించి కొంతమంది అనుమానితులను అరెస్టు చేశామని పోలీసులు చెప్పారు. వివాదాస్పద కాలువ ప్రాజెక్టుకు, కార్పొరేట్ వ్యవసాయానికి వ్యతిరేకంగా తాము నిరసన తెలుపుతున్నామని నిరసనకారులు తెలిపారు. ఈ ప్రాజెక్టు రైతులు, సాధారణ ప్రజల ప్రయోజనాలకు విరుద్ధమని మండిపడ్డారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, ఈ సంఘటన సమయంలో, భద్రతా దళాలు వెంటనే అప్రమత్తమై, ఆసిఫా జర్దారీ వాహనాన్ని సురక్షితంగా పంపించి వేశారు. ఎఫ్‌ఐఆర్ నమోదు చేశామని, కొంతమంది అనుమానితులను అరెస్టు చేశామని పోలీసులు తెలిపారు. ప్రజా శాంతికి విఘాతం కలిగించే ఎవరైనా ప్రయత్నించినా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. భద్రతా దళాలు ఈ విషయాలను తీవ్రంగా పరిగణిస్తామని, సామాజిక శాంతిని కాపాడటానికి అప్రమత్తంగా ఉండాలని ఎస్ఎస్‌పీ చెప్పారు.
ఆసిఫా జర్దారీ కాన్వాయ్‌పై నిరసనకారులు దాడికి యత్నం
May 24, 2025
0
Tags