తెలంగాణలోని సూర్యాపేట డీఎస్పీ పార్థసారథి లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు దొరికిపోయాడు. దీంతో హైదరాబాద్ లోని హయత్ నగర్‌లోఆయన నివాసంతో పాటు మరికొన్నిచోట్ల ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. ఇంట్లో అక్రమంగా వంద బుల్లెట్లు ఉన్నట్లు గుర్తించారు. అంతేకాకుండా, ఆయన ఇంట్లో భారీగా ఆస్తులకు సంబంధించిన పలు డాక్యుమెంట్లను కూడా గుర్తించారు. ఇల్లీగల్గా బుల్లెట్స్ ఉండడంతో ఏసీబీ అధికారులు హయత్ నగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. డీఎస్పీ పార్థసారధిపై హయత్ నగర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
సూర్యాపేట డీఎస్పీ ఇంట్లో వంద అక్రమ బుల్లెట్లు స్వాధీనం
May 13, 2025
0
Tags