బెంగాల్‌లోని నదియా జిల్లా శాంతీపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బేర్పారా ప్రాంతంలో బాపన్ షేక్, మధు ఖాతూన్ దంపతులు నివసిస్తున్నారు. ఈ నెల 2న తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో బాపన్ షేక్ ఇంట్లో మధు ఖాతూన్ గట్టిగా కేకలు వేయడం స్థానికులు గమనించారు. దీంతో చుట్టుపక్కల వారు ఇంటి వద్దకు వెళ్లి పరిశీలించగా ఇంట్లో నుంచి గట్టిగా ఏడుస్తూ బయటకు వచ్చింది. ఆమె ముక్కు నుంచి తీవ్రరక్తస్రావం కావడంతో ఆమెకు ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. ఏం జరిగిందని విచారించగా భర్త తన ముక్కును కొరుక్కుతిన్నాడని ఆమె చెప్పడంతో వారంతా ఖంగుతిన్నారు. అవకాశం దొరికితే నీ ముక్కును కొరికి తినేస్తానని భర్త అనేవాడని, చివరకు అన్నంత పని చేశాడని కన్నీటి పర్యంతం అయ్యింది. ఈ దారుణంపై తన తల్లితో కలిసి మధు ఖాతూన్ శాంతీపూర్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో విషయం బయటకు వచ్చింది.
బెంగాల్‌లో భార్య ముక్కు కొరికి తిన్న భర్త !
May 05, 2025
0
Tags