ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ ప్రైజ్‌మనీని భారీగా పెంచిన ఐసీసీ

Telugu Lo Computer
0


ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ ప్రైజ్‌మనీని ఐసీసీ భారీగా పెంచింది. 2023-25 డబ్ల్యూటీసీ ప్రైజ్‌మనీని (5.76 మిలియన్‌ డాలర్లు) రూ.49.27 కోట్లుగా నిర్ణయించింది. ఈ మొత్తాన్ని ఈ డబ్ల్యూటీసీలో పాల్గొన్న తొమ్మిది జట్లకు పంచనున్నారు. గత రెండు ఎడిషన్లలో ప్రైజ్‌మనీ 3.8 మిలియన్ డాలర్లు మాత్రమే. ఈ ఎడిషన్‌ ఫైనల్‌లో ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా తలపడుతున్నాయి. జూన్‌ 11న లార్డ్స్‌ వేదికగా ఈ మ్యాచ్ ప్రారంభంకానుంది. ఇందులో విజేతగా నిలిచిన జట్టుకు రూ.30.78 కోట్లు, రన్నరప్‌ నిలిచిన టీమ్‌కు రూ.18.46 కోట్లు ఇవ్వనున్నట్లు ఐసీసీ తెలిపింది. పాయింట్ల పట్టికలో మూడో స్థానంలో టీమ్‌ఇండియాకు రూ.12.31 కోట్లు దక్కనున్నాయి. నాలుగో స్థానంలో ఉన్న న్యూజిలాండ్‌కు రూ.10.26 కోట్లు, ఐదో ప్లేస్‌లో నిలిచిన ఇంగ్లాండ్‌కు రూ.8.2 కోట్లు, ఆరో స్థానంలో ఉన్న శ్రీలంకకు రూ.7.18 కోట్లు, తర్వాతి స్థానాల్లో నిలిచిన బంగ్లాదేశ్‌కు (రూ.6.15 కోట్లు), వెస్టిండీస్‌కు (రూ.5.13 కోట్లు), పాకిస్థాన్‌కు (రూ.4.10 కోట్లు) అందనున్నాయి. ఐపీఎల్‌ 2025 సీజన్‌ జూన్ 3న ముగియనుంది. తర్వాత ఐదు టెస్టుల సిరీస్‌ కోసం టీమ్ఇండియా ఇంగ్లాండ్‌ పర్యటనకు వెళ్లనుంది. ఈ సిరీస్‌తోనే 2025-2027 డబ్ల్యూటీసీ మొదలుకానుంది. 

Post a Comment

0Comments

Post a Comment (0)