అంగన్వాడీల జీతాలు తగ్గించడం ఎంతవరకు సమంజసం?

Telugu Lo Computer
0


తెలంగాణలో మినీ అంగన్వాడీ కార్యకర్తలను అంగన్వాడీలుగా గుర్తించి పూర్తి జీతం చెల్లించాలని బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే హరీశ్‌ రావు డిమాండ్‌ చేశారు. అంగన్వాడీలుగా గుర్తించి ఏడాది దాటినా కాంగ్రెస్‌ ప్రభుత్వం వారికి ఇప్పటికీ పెరిగిన జీతం ఇవ్వలేదని విమర్శించారు. బీఆర్ఎస్ ఇచ్చిన జీవోను కాపీ కొట్టి రేవంత్‌ సర్కార్‌ ప్రచారం చేసుకున్నదని మండిపడ్డారు. మూడు నెలలు మాత్రమే పెంచిన జీతం ఇచ్చి గతేడాది కాలంగా వారిని పాత జీతానికే పని చేపించుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. జీతాన్ని రూ.13,650 నుంచి తిరిగి రూ.7,800కి తగ్గించడం దారుణమని, బహుశా పెంచిన జీతాలను తగ్గించే కొత్త సాంప్రదాయానికి తెర లేపిన రాష్ట్ర ప్రభుత్వం దేశంలో ఎక్కడా లేదేమోనని ఎద్దేవా చేశారు. అన్నిట్లో తెలంగాణ రైజింగ్ అని చెబుతూ అంగన్వాడీల జీతాలు తగ్గించడం ఎంతవరకు సమంజసమన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో పని చేస్తున్న మహిళల కడుపు కొడుతున్నాదని మండిపడ్డారు. మే నెల జీతాన్ని 8 జిల్లాల్లో మాత్రమే ఇచ్చి మిగతా జిల్లాల వారికి ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు. మినీ అంగన్వాడీలు ప్రచార సాధనాలు కాదని, వారికి నిజమైన గౌరవం ఇవ్వాలన్నారు. జనవరి 2024 నుంచి 12 నెలలకు పెరిగిన జీతాలు పూర్తి స్థాయిలో చెల్లించాలని డిమాండ్‌చేశారు. అంగన్వాడీ కేంద్రాలుగా మారిన ప్రతీ చోట హెల్పర్లను నియమించాలన్నారు. మే నెల పెరిగిన జీతాలు అందని జిల్లాల్లో తక్షణమే చెల్లించాలన్నారు. ఈ మేరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి బహిరంగ లేఖ రాశారు.

Post a Comment

0Comments

Post a Comment (0)