రైతుల సమస్యలపై ఆరుగురు మంత్రులతో క్యాబినెట్‌ సబ్ కమిటీ ఏర్పాటు

Telugu Lo Computer
0


ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన జరుగుతున్న మంత్రివర్గ సమావేశంలో రైతుల సమస్యలపై సుదీర్ఘ చర్చ జరిగింది. గత ఏడాదితో పోల్చుకుంటే ఈ ఏడాది వివిధ పంటల దిగుబడులు పెరిగాయని అధికారులు వివరించారు. అంతర్జాతీయ పరిణామాలు, దేశవిదేశాల్లో నెలకొన్న ప్రత్యేక పరిస్థితుల కారణంగా వివిధ పంటల ధరలపై ప్రభావం పడినట్లు తెలిపారు. మిర్చి, పొగాకు, ఆక్వా, కోకో, చెరకు, మామిడి వంటి పంట ఉత్పత్తుల ధరలు తగ్గడానికి గల కారణాలు వివరించారు. రైతుల్ని ఆదుకునేందుకు సిద్ధంగా ఉన్నామని చంద్రబాబు తెలిపారు. వ్యవసాయ దిగుబడులు, గిట్టుబాటు ధరలు, నిత్యావసరాల ధరలపై ఆరుగురు మంత్రులతో క్యాబినెట్‌ సబ్ కమిటీ ఏర్పాటు చేశారు. రైతులకు గిట్టుబాటు ధర దక్కేందుకు తీసుకోవాల్సిన చర్యలపై ఈ కమిటీ నిరంతరం పర్యవేక్షించనుంది. మంత్రివర్గ సమావేశంలో 45 నిమిషాల పాటు వ్యవసాయ రంగం, అన్నదాతల కష్టాలు, మార్కెటింగ్‌పై మంత్రులు చర్చించారు. రైతులకు సాంత్వన చేకూరేలా క్షేత్ర స్థాయిలో ఫలితాలు కనిపించేలా ప్రభుత్వ చర్యలు ఉంటాయని ముఖ్యమంత్రి తెలిపారు.

Post a Comment

0Comments

Post a Comment (0)