'ది ఫ్యామిలీమ్యాన్ సీజన్ 2' దర్శకుడు రాజ్ నిడిమోరు, నటి సమంత గురించి కొంతకాలంగా నెట్టింట వార్తలు చక్కర్లు కొడుతోన్న విషయం తెలిసిందే. ఇటీవల తరచూ కలిసి కనిపించడంతో వీరిద్దరూ రిలేషన్‌లో ఉన్నారని ప్రచారం జరుగుతోంది. ఇదిలా ఉండగా, 'శుభం' సక్సెస్‌లో భాగంగా ఆ చిత్ర బృందం, దర్శకుడు రాజ్ నిడిమోరుతో కలిసి దిగిన ఫొటోలను బుధవారం సమంత ఇన్‌స్టాలో షేర్ చేశారు. 'శుభం'తో అద్భుతమైన ప్రయాణం మొదలైందని పేర్కొన్నారు. ఈ ఫొటో అంతటా వైరల్‌గా మారిన తరుణంలో రాజ్ సతీమణి శ్యామాలి తాజాగా ఇన్‌స్టా వేదికగా ఒక సందేశాత్మక పోస్ట్ పెట్టారు. ''నా గురించి మాట్లాడేవారికి.. నా తరఫున మాట్లాడేవారికి.. నేను చెప్పేది వినేవారికి.. నా గురించి వార్తలు వినేవారికి.. నా గురించి రాసే వారికి నా కోసం ఆలోచించేవారందరికీ దేవుడు ఆశీర్వాదం, ప్రేమ ఉండాలని కోరుకుంటున్నా'' అనే పోస్ట్‌ను ఆమె షేర్ చేశారు. ఆమె ఉన్నట్టుండి ఇలాంటి సందేశం ఎందుకు షేర్ చేశారా? అని మాట్లాడుకుంటున్నారు. తన భర్త రాజ్, నటి సమంత గురించి వార్తలు వస్తున్న వేళ ఆమె ఈ పోస్ట్ చేయడంతో ఇది నెట్టింట వైరల్‌గా మారింది. శ్యామాలి సైకాలజీ చదువుకున్న ఆమె బాలీవుడ్ దర్శకులు రాకేశ్ ఓం ప్రకాశ్ మిశ్రా, విశాల్ భరద్వాజ్ వద్ద అసిస్టెంట్ దర్శకురాలిగా పనిచేశారు. 'రంగ్‌దే బసంతి', 'ఓంకార' చిత్రాలకు క్రియేటివ్ కన్సల్టెంట్‌గా వర్క్ చేశారు. 2015లో రాజ్ నిడిమోరుతో ఆమె వివాహం జరిగింది. వీరికి ఒక పాప ఉందని సమాచారం. వివాహం తర్వాత రాజ్ రూపొందించిన చిత్రాలకు సంబంధించి ఆమె క్యాస్టింగ్‌లో సాయం చేస్తుండేవారు. ఇదే విషయాన్ని ఆయన గతంలో పలు ఇంటర్వ్యూల్లో చెప్పారు. రాజ్ - శ్యామాలి విడిపోతున్నారంటూ కొన్ని రోజుల క్రితం వార్తలు కూడా వచ్చాయి. రాజ్- డీకే సంయుక్తంగా తెరకెక్కించిన 'ది ఫ్యామిలీమ్యాన్ సీజన్ 2', 'సిటడెల్: హనీ బన్నీ'లో సమంత నటించిన సంగతి తెలిసిందే. ఆయా ప్రాజెక్ట్‌ల కోసం వర్క్ చేస్తున్న సమయంలోనే రాజ్‌తో ఆమెకు పరిచయం ఏర్పడింది.
రాజ్‌తో సమంత ఫొటోను పోస్ట్ చేసిన దర్శకుడి భార్య శ్యామాలి : నెట్టింట వైరల్
May 15, 2025
0
Tags