శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడుతున్న గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని హుటాహుటిన వైద్య పరీక్షల కోసం పోలీసులు విజయవాడ ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకొచ్చారు. జైలులో శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడుతున్న క్రమంలో ఈ విషయాన్ని న్యాయాధికారికి వంశీ వివరించారు. ఆక్సిజన్ ఎనలైజర్ పెట్టుకోవడం వల్ల ముక్కు వద్ద ఉన్న ఎముకలు నొప్పి వస్తున్నాయని చెప్పారు. ఆక్సిజన్ ఎనలైజర్ పెట్టుకోవడం వల్ల ముక్కు వద్ద ఉన్న ఎముకలు నొప్పి వస్తున్నట్లు చెప్పినట్లు సమాచారం. అంతేకాక వైద్యులు రాసిన మందులు కాకుండా జైలు అధికారులు వేరే మందులు ఇస్తున్నారని వంశీ తరఫు న్యాయవాది సత్య శ్రీ కోర్టుకు తెలిపారు. దీంతో వంశీకి ప్రభుత్వాసుపత్రిలో లేదా ప్రభుత్వ గుర్తింపు పొందిన ఆస్పత్రిలో చికిత్స చేయించాలని ఆదేశిస్తూ న్యాయాధికారి ఉత్తర్వులు జారీ చేశారు.
గన్నవరం మాజీ ఎమ్మెల్యే వంశీకి తీవ్ర అస్వస్థత
May 15, 2025
0
Tags