కాలేజీ కరస్పాండెంట్ ను చితకబాదిన విద్యార్థిని తల్లిదండ్రులు

Telugu Lo Computer
0


ఆంధ్రప్రదేశ్ లోని అన్నమయ్య జిల్లా మదనపల్లెలో ఇంటర్ విద్యార్థినిని కాలేజీ కరస్పాండెంట్ లైంగిక వేధింపులకు గురిచేశాడు. ఆలస్యంగా వెలుగు చూసిన ఈఘటన స్థానికంగా కలకలం రేపింది. విద్యార్థినిని అసభ్యకరంగా తాకుతూ లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. రాత్రి సమయంలో కాల్స్ అసభ్యకర మెసేజ్ లు చేస్తూ వేదించసాగాడు. కరస్పాండెంట్ నాగిరెడ్డి వేధింపులతో విసిగిపోయిన విద్యార్థిని ఈ విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పింది. వెంటనే జూనియర్ కాలేజ్ వద్దకు చేరుకున్న బాధిత విద్యార్థిని తల్లిదండ్రులు కాలేజీ  కరస్పాండెంట్ నాగిరెడ్డిని చితకబాదారు. కాలేజీ కరస్పాండెంట్ నాగిరెడ్డిపై కఠిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు తెలిపారు. 

Post a Comment

0Comments

Post a Comment (0)