టారిఫ్‌ల పెంపుతో ఎయిర్‌టెల్ లాభం ఐదింతలు ?

Telugu Lo Computer
0


యిర్‌టెల్‌ 2024-25 ఆర్థిక సంవత్సరం మార్చితో ముగిసిన త్రైమాసికంలో రూ.11,022 కోట్ల నికర లాభాన్ని నమోదు చేసింది. గతేడాది ఇదే సమయంలో రూ.2071.6 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. అప్పటితో పోలిస్తే కంపెనీ నికర లాభం ఐదింతలు పెరగడం గమనార్హం. గతేడాది జులైలో కంపెనీ చేపట్టిన ఛార్జీల పెంపు కారణంగా అనూహ్యంగా లాభాలు పెరిగాయి. ఎయిర్‌టెల్‌ కార్యకలాపాల ద్వారా వచ్చే ఆదాయం 27 శాతం మేర పెరిగింది. 2024 మార్చితో ముగిసిన త్రైమాసికంలో రూ.37,599.1 కోట్లుగా ఉన్న ఆదాయం.. రూ.47.876.2 కోట్లకు పెరిగినట్లు రెగ్యులేటరీ ఫైలింగ్‌లో పేర్కొంది. భారతీ ఎయిర్‌టెల్‌ ఇండియా ఆదాయం 28.8 శాతం పెరిగి రూ.36,735 కోట్లుగా నమోదైంది. గతేడాది జులైలో ఎయిర్‌టెల్ సహా అన్ని కంపెనీలూ టెలికాం ఛార్జీలను పెంచిన సంగతి తెలిసిందే. దీంతో వ్యక్తి నుంచి వచ్చే సగటు ఆదాయం (ARPU) రూ.209 నుంచి రూ.245కి పెరిగింది. సమీక్షా త్రైమాసికం నాటికి భారత్‌లో వినియోగదారుల సంఖ్య 42.4 కోట్లకు పెరిగింది. పూర్తి ఆర్థిక సంవత్సరానికి కంపెనీ నికర లాభం రూ.7,467 కోట్ల నుంచి రూ.33,556 కోట్లకు పెరిగింది. ఆదాయం రూ.148,982.4 కోట్ల నుంచి రూ.1,72,985.2 కోట్లకు చేరింది.

Post a Comment

0Comments

Post a Comment (0)