గతంలో రేషన్‌ కార్డుల కోసం దరఖాస్తు వారు మళ్లీ చేసుకోవాల్సిన అవసరం లేదు

Telugu Lo Computer
0


ఆంధ్రప్రదేశ్ లో గత ప్రభుత్వ హయాంలో రేషన్‌ కార్డుల కోసం దరఖాస్తు చేసుకున్న వారు మళ్లీ దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం లేదని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. వైసీపీ హయాంలో వచ్చిన దరఖాస్తుల్లో 3.36 లక్షల దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయని, అవి ప్రస్తుతం ప్రభుత్వ పరిశీలనలో ఉన్నట్టు పేర్కొన్నాయి. కాగా రేషన్‌ కార్డుల కోసం ఈ నెల 15వ తేదీ నుంచి రాష్ట్ర ప్రభుత్వం వాట్సాప్‌లోనూ దరఖాస్తులు స్వీకరించనుంది. జూన్‌లో కొత్త రేషన్‌ కార్డులు జారీ చేసేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. కాగా కొత్త రేషన్‌ కార్డులు, రేషన్‌ కార్డు స్ల్పిట్‌, కొత్త సభ్యుల చేరిక, అడ్రస్‌ మార్పులు చేసుకునేందుకు కూడా ప్రభుత్వం అవకాశం కల్పిస్తోంది. క్యూఆర్‌ కోడ్‌తో కూడిన రేషన్‌ కార్డులను ప్రభుత్వం జారీ చేయనుంది. ఈ రేషన్‌ కార్డుల ద్వారా దేశంలో ఎక్కడైనా రేషన్‌ తీసుకునే సదుపాయం ఉంటుంది. ప్రస్తుతం 95 శాతం రేషన్‌ లబ్ధిదారుల ఈ కేవైసీ పూర్తైందని ప్రభుత్వం తెలిపింది. 

Post a Comment

0Comments

Post a Comment (0)