ఐపీఎల్-2025 సీజన్‌ను లక్నో సూపర్ జెయింట్స్ ఓటమితో ముగించింది. సోమవారం ఏకానా స్టేడియం వేదికగా రాయల్స్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌లో 6 వికెట్ల తేడాతో ఆర్సీబీ పరాజయం పాలైంది. అయితే ఓటమి బాధలో ఉన్న లక్నో కెప్టెన్ రిషబ్ పంత్‌కు మరో బిగ్ షాక్ తగిలింది. ఆర్సీబీతో జరిగిన మ్యాచ్‌లో స్లో ఓవర్ రేటు మెయింటిన్ చేసినందుకు గానూ పంత్‌కు రూ. 30 లక్షల భారీ జరిమానా ఐపీఎల్ ఎడ్వైజరీ కమిటీ విధించింది. అలాగే జట్టులో ఇంపాక్ట్ ప్లేయర్ సహా అందరూ రూ. 12 లక్షలు లేదా మ్యాచ్ ఫీజులో 50శాతం జరిమానాగా చెల్లించాలని సదరు కమిటీ ఆదేశించింది. ఈ ఏడాది సీజన్‌లో లక్నో జట్టు స్లో ఓవర్ రేట్‌ను నమోదు చేయడం ఇది మూడో సారి. అందుకే అంత భారీ మొత్తంలో జరిమానా విధించారు. "లక్నో సూపర్ జెయింట్స్ సారథి రిషబ్ పంత్‌కు జరిమానా విధించాం. ఏకానా స్టేడియం వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌లో స్లో ఓవర్ రేట్‌ను కొనసాగించినందుకు ఈ నిర్ణయం తీసుకున్నాము. ఇది మూడో సారి అయినందున ఆర్టికల్ 2.22 ఐపీఎల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ప్రకారం పంత్ కు రూ. 30 లక్షలు ఫైన్ వేశాము ' అని ఐపీఎల్ అడ్వైజరీ కమిటీ ఓ ప్రకటనలో పేర్కొంది.
రిషబ్ పంత్‌కు రూ. 30 లక్షల జరిమానా
May 28, 2025
0
Tags