జియో ఎలక్ట్రిక్ స్కూటర్ 2025 విడుదల

Telugu Lo Computer
0


దేశీయ మార్కెట్లో జియో ఎలక్ట్రిక్ స్కూటర్ 2025 విడుదలైంది. పట్టణాల్లో రోజువారీగా తక్కువ దూరాలకు వినియోగించడానికి, దూర ప్రాంతాలకు వెళ్లేందుకు ఉపయోగించడానికి ఈ ఈవీని ప్రత్యేకంగా రూపొందించారు. ఎలాంటి హంగు ఆర్భాటాలు లేకుండా సింపుల్‌గా ఉండేలా, మధ్యతరగతి ప్రజలకు అనువుగా ఈ స్కూటర్‌ను డిజైన్‌ చేశారు. ఈ స్కూటర్‌లో బ్యాగులు, ఇతర లగేజీని పెట్టుకోవడానికి అనువుగా రూపొందించిన విశాలమైన ఫ్లాట్ ఫుట్‌బోర్డ్‌ ఉంది. దూర ప్రయాణాలు చేసినప్పుడు వాహనాన్ని నడుపుతున్న వ్యక్తికి, వెనుక కూర్చున్న వ్యక్తికి సౌకర్యవంతంగా ఉండేలా ఈ ఈ-స్కూటర్ కుషన్డ్ సీటును రూపొందించారు. దేశంలోని గుంతల రోడ్లపై కూడా సునాయాసంగా పరుగు తీసేలా దీనికి 12-అంగుళాల అల్లాయ్ వీల్స్ ఉన్నాయి. ఈ స్కూటర్ 4kW హబ్ మోటారుతో పనిచేస్తుంది. ఇది 110 Nm తక్షణ టార్క్‌ను అందించగలదు. సిటీ ట్రాఫిక్‌లో సహజంగా అనిపించేలా ఈ స్కూటర్ రూపకల్పన జరిగింది. ఈ స్కూటర్ మూడు రైడ్ మోడ్‌లతో వచ్చింది. అందులో మొదటిది ఎకో మోడ్‌, రెండోది సిటీ మోడ్‌, మూడోది స్పోర్ట్ మోడ్‌. ఎకో మోడ్ వాహనంలోని బ్యాటరీ లైఫ్‌ ఎక్కువగా ఉంటుంది. సిటీ మోడ్ వాహనం నగరంలో రోజువారీ ప్రయాణాలకు అనువైనది. ఇక స్పోర్ట్ మోడ్ వాహనం అధిక వేగంతో హైవేలపై పరుగులు తీసేందుకు అనువైనది. దీనిలోని పునరుత్పాదక బ్రేకింగ్ సిస్టమ్ బ్యాటరీకి శక్తిని తిరిగి అందిస్తుంది. ఈ వాహనంలో 3.2 kWh లిథియం-అయాన్ బ్యాటరీ ఉంటుంది. దీన్ని ఒక్కసారి చార్జిచేస్తే దాదాపుగా 80 నుంచి 100 కి.మీ వరకు వెళ్తుంది. దీనిలోని హైబ్రిడ్ ఛార్జింగ్ మోడల్ ఇంట్లో చార్జింగ్‌ పెట్టుకోవడానికి, లేదంటే ప్రత్యేక చార్జింగ్‌ స్టేషన్లలో బ్యాటరీలను మార్చుకోవడానికి అనువుగా ఉంటుంది. బ్యాటరీ దుమ్ముకు, నీళ్లకు ప్రభావితం కాకుండా ఈ స్కూటర్‌ను డిజైన్‌ చేశారు. పెట్రోల్‌ మోడళ్ల కంటే ఈ ఎలక్ట్రిక్‌ స్కూటర్ నిర్వహణ ఖర్చు ఐదు రెట్లు చౌకగా ఉంటుంది. ఆయిల్ ఛేంజ్‌, స్పార్క్ ప్లగ్ భర్తీ లాంటి ఖర్చులు ఉండవు. దీన్ని రోజువారీ ప్రయాణాలు చేసేవారికి, టెక్నాలజీపై అవగాహన ఉన్న కస్టమర్లకు, విద్యార్థులకు, ఇప్పటికే ఒక వాహనం ఉండి రెండో వాహనం కొనుగోలు కోసం చూస్తున్న వారిని లక్ష్యంగా చేసుకుని దీన్ని రూపొందించారు. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ ధర రూ.70 వేల నుంచి 80 వేల మధ్య ఉండవచ్చని అంచనా. అయితే ఇది హై-స్పీడ్‌లో వెళ్లాలనుకునే రైడర్‌లకు, ఒకసారి ఛార్జింగ్‌తో 100 కిలోమీటర్ల కంటే ఎక్కువ దూరం ప్రయాణించాలనుకునే వారికి అనువైనది కాదని చెప్పవచ్చు.

Post a Comment

0Comments

Post a Comment (0)