నీట్-యూజీ 2025 పరీక్షా ఫలితంపై మద్రాస్ హైకోర్టు మధ్యంతర స్టే

Telugu Lo Computer
0


నీట్-యూజీ 2025 పరీక్షా ఫలితంపై మద్రాస్ హైకోర్టు మధ్యంతర స్టే విధించింది. తదుపరి విచారణ జరిగే వరకు ఫలితాలను విడుదల చేయవద్దని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీని ఆదేశిస్తూ ధర్మాసనం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. చెన్నైలోని అవడి పరీక్షా కేంద్రంలో విద్యుత్తు అంతరాయం కారణంగా రాయడంలో ఇబ్బంది ఎదురైందని విద్యార్థులు ఆరోపిస్తూ హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. దీనిపై ధర్మాసం స్పందిస్తూ ఈ ఉత్తర్వులు ఇచ్చింది. తమ పరీక్షా కేంద్రంలో విద్యుత్ సరఫరా నిలిచిపోయిన తర్వాత ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయకపోవడంతో వెలుతురు లేకపోయినా పరీక్ష రాయాల్సి వచ్చిందని 13 మంది విద్యార్థులు మద్రాస్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ జరిపిన ధర్మాసనం నీట్ ఫలితాల విడుదలపై కీలక నిర్ణయం తీసుకుంది. ఫలితాలు ఇప్పుడే వెల్లడి చేయొద్దని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీని ఆదేశిస్తూ జూన్ 2వ తేదీకి తదుపరి విచారణను వాయిదా వేసింది. కాగా, మధ్యప్రదేశ్ హైకోర్టు ఇండోర్ బెంచ్ కూడా నీట్ యుజి 2025 ఫలితాల ప్రకటనపై తాత్కాలిక స్టే విధించింది. ఈ అంశంపై నాలుగు వారాల్లోగా సమాధానం ఇవ్వాలని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్‌టిఎ), కేంద్ర ప్రభుత్వం, మధ్యప్రదేశ్ వెస్ట్ జోన్ విద్యుత్ పంపిణీ కంపెనీకి నోటీసు జారీ చేసింది.

Post a Comment

0Comments

Post a Comment (0)