సెప్టెంబర్‌లో ఐఫోన్ 17 ఎయిర్ విడుదల ?

Telugu Lo Computer
0


ఫోన్ 17 సిరీస్ నుంచి లాంఛ్ కానున్న మొబైల్ ఫీచర్స్ లీక్ అయ్యాయి. ఐఫోన్ 17 ఎయిర్ పేరుతో సెప్టెంబరులో లాంచ్ అయ్యే అవకాశం ఉన్న ఈ ఫోన్లకి ఫీచర్స్ లీకవ్వడంతో ఇప్పటి నుంచే భారీ డిమాండ్ ఏర్పడింది. ఈ ఫోన్‌ వ్యవహారం ప్రస్తుతం టెక్ కమ్యూనిటీలో చర్చనీయాంశంగా మారింది. కొరియన్ బ్లాగ్ నావెర్‌లో "yeux1122" అనే అకౌంట్ ద్వారా వెలువడిన లీక్ ప్రకారం ఈ ఏడాది అత్యంత సన్నని ఐఫోన్‌ను మార్కెట్లోకి తీసుకురావడానికి సిద్ధంగా ఉందని తెలుస్తోంది. అత్యంత సన్నని, తేలికైన ఐఫోన్ గా 17 ఎయిర్ ని రూపొందిస్తున్నట్టు ప్రచారం నడుస్తోంది. ఐఫోన్ 17 ఎయిర్ బరువు సుమారు 145 గ్రాములు, మందం కేవలం 5.5 మిల్లీమీటర్లు మాత్రమేనని అంటున్నారు. ఇది గనుక నిజమైతే, ఇప్పటి వరకూ విడుదలైన ఐఫోన్‌ల్లో ఇది అత్యంత సన్నగా ఉండే ఫోన్ ఇదే అవుతుంది. గతంలో వచ్చిన ఐఫోన్ SE 2 లేదా 13 మినీ మోడళ్లను బీట్ చేస్తుందని భావిస్తున్నారు. అయితే ఈ డిజైన్ బ్యాటరీ విషయంలో కొంచెం మైనస్ అనిపిస్తుంది. లీకుల ప్రకారం, ఐఫోన్ 17 ఎయిర్‌లో 2,800mAh బ్యాటరీ ఉండే అవకాశం ఉంది. ఇది 6.6-అంగుళాల పెద్ద డిస్‌ప్లే ఉన్న ఫోన్‌కు సరిపోదని టెక్ నిపుణులు భావిస్తున్నారు. అయితే యాపిల్ హై-డెన్సిటీ బ్యాటరీ టెక్నాలజీ ఉపయోగిస్తుండటం వల్ల, నిజమైన పనితీరు 15-20 శాతం మెరుగ్గా ఉండే అవకాశం ఉందని చెబుతున్నారు. ఈ పరిమితిని దృష్టిలో పెట్టుకుని యాపిల్ ప్రత్యేకమైన బ్యాటరీ కేస్‌ను ఆప్షనల్‌గా అందించే అవకాశముందని అంచనా వేస్తున్నారు. ఐఫోన్ 17 ఎయిర్‌లో ఉల్ట్రా-వైడ్ కెమెరా ఉండకపోవచ్చని భావిస్తున్నారు. 48MP రియర్ కెమెరా, 12MP ఫ్రంట్ కెమెరా ఉంటాయని సమాచారం. A19 బయోనిక్ చిప్‌సెట్ ఉండే అవకాశం. 6.6 అంగుళాల AMOLED డిస్‌ప్లే తో వచ్చే అవకాశం ఉంది. కొత్త C1 మోడెం తో బ్యాటరీ సేవింగ్ మెరుగవవచ్చు.

Post a Comment

0Comments

Post a Comment (0)