గాజాపై ఇజ్రాయెల్ బాంబుల వర్షం కురిపిస్తోంది. గాజాలో రక్తపు టేరులు పారిస్తోంది. తాజాగా జరిపిన వైమానిక దాడుల్లో గాజాలో 100 మంది మరణించారు. గాజా స్ట్రిప్ అంతటా వైమానిక దాడులు చేసింది. రాత్రిపూట జరిగిన ఈ దాడిలో కనీసం 100 మంది పాలస్తీనియన్లు మరణించారని స్థానిక ఆరోగ్య అధికారులు తెలిపారు. కాగా ఇజ్రాయెల్, హమాస్ మధ్య కాల్పుల విరమణ కోసం మధ్యవర్తులు ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే ఇజ్రాయెల్ మిలిటరీ నుంచి ఎలాంటి స్పందన లేదు. ఇజ్రాయెల్ దాడులను కొనసాగిస్తోంది. గురువారం నుంచి బాంబుల వర్షం కురిపిస్తోంది. ఈ దాడిలో వందలాది మంది చనిపోయారు. ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో 100 మంది అమరులయ్యారు. అనేక కుటుంబాలు చిన్నాభిన్నాం అయ్యాయి. ఇజ్రాయెల్ బాంబుల వర్షం కురిపిస్తోంది అని గాజా ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు. బందీలను విడిపించేలా హమాస్‌పై ఒత్తిడి తేవడానికి మార్చి ప్రారంభం నుండి గాజాలోకి వైద్య, ఆహారం, ఇంధన సరఫరాలను ఇజ్రాయెల్ నిరోధించింది. మొత్తం గాజా స్ట్రిప్‌ను స్వాధీనం చేసుకోవడం, సహాయాన్ని నియంత్రించడం వంటి ప్రణాళికలు రచించింది. ఇజ్రాయెల్ కాల్పుల విరమణకు ప్రతిగా బందీలను మాత్రమే విడుదల చేస్తామని హమాస్ చెబుతోంది. అమెరికా మద్దతుతో ఈజిప్ట్, ఖతార్ కు చెందిన మధ్యవర్తులు ఇజ్రాయెల్, హమాస్ మధ్య కాల్పుల విరమణకు ప్రయత్నాలు చేస్తున్నారు. దక్షిణ గాజా స్ట్రిప్‌లోని ఖాన్ యూనిస్‌లో నిరాశ్రయులైన కుటుంబాలు నివసించే ఒక టెంట్ శిబిరంపై ఇజ్రాయెల్ వైమానిక జరిపిన దాడిలో కనీసం 24 మంది పాలస్తీనియన్లు మరణించారని స్థానిక ఆరోగ్య అధికారులు ఆదివారం తెలిపారు. మధ్యవర్తులు ఇజ్రాయెల్, హమాస్ మధ్య కొత్త రౌండ్ చర్చలు జరిపారు. ఇజ్రాయెల్ సైనిక దాడిని విస్తరించింది. బాంబుల వర్షం కురిపిస్తోంది. గత 72 గంటల్లో వందలాది మందిని బలిగొంది. తాజా దాడిలో మహిళలు, పిల్లలు కూడా మరణించారని, డజన్ల కొద్దీ ఇతర వ్యక్తులు గాయపడ్డారని, అనేక టెంట్లు తగలబడిపోయాయని గాజా అధికారులు వెల్లడించారు.
గాజాపై ఇజ్రాయెల్ బాంబుల వర్షం : 100 మంది మృతి
May 18, 2025
0
Tags