ఆంధ్రప్రదేశ్ లోని ప్రతి నియోజకవర్గంలో వంద పడకల ఆస్పత్రి ఏర్పాటుకు కార్యాచరణ సిద్ధం చేయాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు. వైద్యారోగ్యశాఖ అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. అవసరాన్ని బట్టి పీహెచ్‌సీ, సీహెచ్‌సీలో వర్చువల్ వైద్యసేవలు అందించాలన్నారు. రాష్ట్రంలో కొత్తగా 13 డీ-అడిక్షన్ సెంటర్లు ఏర్పాటు చేయాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. అమరావతి మెగా గ్లోబల్ మెడిసిటీ ప్రాజెక్టు ఏర్పాటుకు చర్యలు చేపట్టాలన్నారు.
ప్రతి నియోజకవర్గంలో వంద పడకల ఆస్పత్రి : చంద్రబాబు
April 04, 2025
0
Tags