నేను సంపాదించిన మొత్తంలో ఒక శాతం కంటే తక్కువ నా పిల్లలకు ఇస్తాను : బిల్‌గేట్స్‌

Telugu Lo Computer
0


మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్‌గేట్స్ తన ముగ్గురు పిల్లలకు ఓ పాడ్‌కాస్ట్‌లో మాట్లాడుతూ ఎన్ని ఆస్తిపాస్తులు ఇవ్వనున్నారో వెల్లడించారు. ''ఈ అంశంలో ప్రతిఒక్కరూ నిర్ణయం తీసుకోవాలి. నా పిల్లలకు మంచి విద్యను అందించాను. విలువలతో పెంచా. తండ్రి కూడబెట్టిన ఆస్తిపై ఆధారపడకుండా వాళ్లు సొంతంగా సంపాదించుకోగలరనే నమ్మకం నాకు ఉంది. నేను సంపాదించిన మొత్తంలో ఒక శాతం కంటే తక్కువ పిల్లలకు ఇస్తాను. ఇదేమీ వారసత్వం కాదు. మైక్రోసాఫ్ట్‌లో విధులు నిర్వర్తించమని వారిని అడగటం లేదు. వారు సొంతంగా సంపాదించుకోవడానికి, విజయం సాధించడానికి అవకాశం ఇవ్వాలని అనుకుంటున్నాను. మన ప్రేమతో వారిని గందరగోళంలోకి నెట్టివేయకూడదు. వారికి కల్పించే అవకాశాలపై స్పష్టత ఇచ్చి, వారు సొంతంగా ఎదిగేలా సిద్ధం చేయాలి'' అని గేట్స్ వెల్లడించారు. సంపన్న కుటుంబాల విలువల ఆధారంగా వారి వారసత్వ ఎంపికలు ఉంటాయని పేర్కొన్నారు. తన మిగిలిన సంపదను దాతృత్వానికి వెళ్తుందని చెప్పారు.

Post a Comment

0Comments

Post a Comment (0)