వాట్సాప్ తీసుకొచ్చిన బెస్ట్ ఫీచర్లలలో 'డిలిట్ మెసేజ్ ఫర్ ఆల్' ఒకటి. ఒకరికి పంపాల్సిన మెసేజ్‌ను మరొకరికి పంపడం సర్వ సాధారణమైన విషయం. అయితే ఈ సమస్యకు చెక్ పెట్టేందుకు వాట్సాప్ 'డిలీట్ మెసేజ్ ఫర్ ఆల్' అనే మెసేజ్‌ను తీసుకొచ్చింది. ఈ ఫీచర్ సహాయంతో అవతలి వ్యక్తి లేదా గ్రూప్‌లో అప్పటికే సెండ్ అయిన మెసేజ్‌ను కూడా డిలీట్ చేసుకోవచ్చు. దీంతో మీరు ఏం మెసేజ్ డిలీట్ చేశారన్న విషయం అవతలి వ్యక్తికి తెలిసే అవకాశం ఉండదు. అయితే మన స్మార్ట్ ఫోన్‌లో ఉన్న ఒక చిన్న ట్రిక్‌తో ఎదుటి వ్యక్తి డిలీట్ చేసిన మెసేజ్ ఏంటో ఇట్టే తెలుసుకోవచ్చు. అదెలాగంటే ముందుగా మీ ఫోన్‌లో సెట్టింగ్ ఆప్షన్‌ను సెలక్ట్ చేసుకోవాలి. అనంతరం సెర్చ బాక్స్‌లో 'నోటిఫికేషన్ హిస్టరీ' అనే ఆప్షన్‌ను వెతకండి. ఇందులో 'యూజ్ నోటిఫికేషన్ హిస్టరీ' అనే ఆప్షన్‌ను ఎనేబుల్ చేసుకోవాలి. ఇలా చేసుకుంటే నోటిఫికేషన్ హిస్టరీలో 'రీసెంట్లీ డిస్‌మిస్డ్' అనే ఆప్షన్‌లో డిలీట్ అయిన మెసేజ్‌లు అన్నీ కనిపిస్తాయి. వాట్సాప్ యాప్‌లో డిలీట్ అయి కనిపించని మెసేజ్‌లు కూడా ఇక్కడ కనిపిస్తాయి.
వాట్సాప్‌లో డిలీట్ చేసిన మెసేజ్‌లను ఎలా చూడాలి ?
April 05, 2025
0
Tags