జెనీవాలో డబ్ల్యూహెచ్ ఓ పాండమిక్ అగ్రిమెంట్ పై నిర్వహించిన 13వ పునఃప్రారంభ సమావేశాల్లో డబ్ల్యూహెచ్ వో డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అధనోమ్ ప్రారంభోపన్యాసం చేస్తూ ప్రపంచాన్ని మరో మహమ్మారి కబళించే అవకాశం ఉందని, అందరూ దానికి సంసిద్ధంగా ఉండాలని అన్నారు. అయితే ఈసారి సైన్స్ ప్రయోగాల వల్లనో ఇంక దేని వల్లనే ఈ ముప్పు రాదని, అంటు వ్యాధులే విజృంభిస్తాయని ఆయన చెబుతున్నారు. ఎప్పుడనేది కచ్చితంగా చెప్పలేనప్పటికీ దానికి రెడీగా ఉండాలని ప్రపంచానికి టెడ్రోస్ పిలుపునిచ్చారు. ఇప్పుడు మరో మహమ్మారి 20 ఏళ్ళ లోపు లేదా అంత కంటే ముందే, ఇంకా చెప్పాలంటే రేపు కూడా మొదలవ్వొచ్చని అన్నారు. కోవిడ్ మహమ్మారికి అధికారికంగా 70 లక్షల మంది చనిపోయారని ఉంది. కానీ నిజానికి ఆ సంఖ్య 2 కోట్ల వరకూ ఉంటుందని డబ్ల్యూహెచ్ వో అంచనా అని ఆయన చెప్పారు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ నుంచి 10 ట్రిలియన్ డాలర్ల కంటే ఎక్కువ ఆర్థిక నష్టాన్ని కలిగించిందని టెడ్రోస్ తెలిపారు.
ప్రపంచానికి మరో మహమ్మారి తప్పదు !
April 09, 2025
0
Tags