యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఉప్పల్ స్టేడియం ముట్టడి

Telugu Lo Computer
0


హెచ్.సి.ఏ వైఖరి నిరసిస్తూ ఉప్పల్ క్రికెట్ స్టేడియంను యూత్ కాంగ్రెస్ నాయకులు ముట్టడించారు. హెచ్.సి.ఏచైర్మన్ జగన్ మోహన్ రావు డౌన్ డౌన్ అంటు నినాదాలు చేశారు. అవినీతికి పాల్పడిన జగన్ మోహన్ రావు పై న్యాయ విచారణ చేయాలని డిమాండ్ చేశారు. హరీష్ రావు బినామీ ఐన జగన్ మోహన్ రావు ఐపీల్ టికెట్స్ బ్లాక్ చేస్తున్నాడని మండిపడ్డారు. ఇవి సరిపోక ఇంకా టికెట్స్ కావాలి అని ఎస్ ఆర్ హెచ్ పై ఒత్తిడి చేస్తున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలా ఒత్తిడి చేసి ఎస్ ఆర్ హెచ్ వేరే రాష్టానికి తరలిపోవాలని చూస్తున్నాడని మండిపడ్డారు. ఇదంతా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బద్నామ్ చేయడానికే జగన్ మోహన్ రావు ఇలాంటి ప్రయత్నం చేస్తున్నాడని అన్నారు. స్టేడియం దగ్గర హెచ్‌సిఏ అధ్యక్షుడు జగన్ మోహన్ రావు దిష్టి బొమ్మను యూత్ కాంగ్రెస్ నాయకులు దగ్థం చేశారు. పోలీసులు వారిని అరెస్టు చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు.

Post a Comment

0Comments

Post a Comment (0)