మయన్మార్ లో 2700 దాటిన భూకంప మరణాలు

Telugu Lo Computer
0


యన్మార్ లో భూకంపం ధాటికి ఇప్పటివరకు 2700 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ సంఖ్య మరింతగా పెరిగే అవకాశం ఉందని సహాయక బృందాలు పేర్కొంటున్నాయి. ఈ పెను విపత్తు కారణంగా అనేక భారీ భవంతులు కుప్పకూలిపోయాయి. ఈ శిథిలాల కింద చిక్కుకున్న వారిని రక్షించేందుకు సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. భూకంప బాధితులకు తక్షణమే ఆహారం, నీరు, నివాసం అందించాల్సిన అవసరం ఎంతైనా ఉందని సహాయక బృందాలు పేర్కొంటున్నాయి. కాగా, ఈ భూవిలయం కారణంగా సంభవించిన మరణాల సంఖ్య 2700 దాటినట్టు మయన్మార్ సైన్యాధ్యక్షుడు జనరల్ మిన్ ఆంగ్ హయింగ్ ప్రకటించారు. మరో 4521 మంది గాయపగా, 441 మంది ఆచూకీ తెలియడం లేదని వెల్లడించారు. ప్రధానంగా ఈ మరణాలు మయన్మార్ దేశ రాజధాని నేపిడా, రెండే అతిపెద్ద నగరమైన మాండలేలోనే అధికంగా ఉన్నాయని పేర్కొ న్నారు. అయితే, ఈ మరణాల సంఖ్య మరింతగా పెరిగే అవకాశం ఉందని పేర్కొన్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)