వాకింగ్‌ చేస్తూ కుప్ప కూలిన రాష్ట్రీయ లోక్‌దళ్ కార్యకర్త !

Telugu Lo Computer
0


త్తరప్రదేశ్‌లోని బులంద్‌షహర్ జిల్లాలో ఆదివారం ఉదయం నడకకు వెళుతుండగా 28 ఏళ్ల అనుమానాస్పదంగా కుప్పకూలి మరణించాడు. బాధితుడిని రాష్ట్రీయ లోక్‌దళ్ కార్యకర్త అమిత్ చౌదరిగా గుర్తించారు. నడుస్తూ ఉండగా ఒక వ్యక్తి వచ్చి చౌదరిని పలకరించి, అతని భుజం తట్టి వెళ్ళిపోయిన దృశ్యాలు సీసీటీవీ ఫుటేజ్‌లో రికార్డైనాయి. ఆ తరువాత అతను అకస్మాత్తుగా గుండెపోటుకు గురైనాడు. తీవ్ర ఇబ్బందికి గురైన అతను ఇంటి ఎదురుగా ఉన్న గోడను ఆసరా చేసుకోవాలని ప్రయత్నించాడు. కానీ ఫలితం లేకపోయింది. జిల్లాలోని మదన్‌పూర్ గ్రామంలోని ఇంటి వెలుపల గుండెపోటుతో మరణించాడు. చౌదరి కుప్పకూలిన తర్వాత కొంతమంది వ్యక్తులు ఆయన ప్రాణాలు కాపాడేందుకు ప్రయత్నించారు. కానీ అతను ప్రాణాలు కోల్పోయాడు. చౌదరి మరణానికి గుండెపోటే కారణమని భావిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్ సోషల్ మీడియాలో వైరల్ అయింది. అని భావిస్తున్నారు.


Post a Comment

0Comments

Post a Comment (0)