బీఎస్ఎన్ఎల్ "హోలీ ధమాకా" !

Telugu Lo Computer
0


మార్చి 14న హోలీ పండుగ సందర్బంగా బీఎస్ఎన్ఎల్ కొత్త ప్లాన్ ను తీసుకువచ్చింది. "హోలీ ధమాకా" ప్లాన్‌ను ప్రకటించింది. ఈ ప్లాన్ ద్వారా అపరిమిత కాల్స్ ను ఏడాది పాటు అందించనుంది. రూ. 2,399 ప్లాన్ వ్యాలిడిటీ 395 రోజులకు మాత్రమే ఉన్న ప్లాన్, ఇప్పుడు ఈ ప్రత్యేక ఆఫర్‌లో భాగంగా 30 రోజుల వ్యాలిడిటీని పొడిగించి 425 రోజులకు పొడిగించింది. దీనిలో అపరిమిత కాలింగ్, రోజుకు 2GB డేటా, రోజు 100 SMSలను అందిస్తుంది. రూ. 1499 ప్లాన్ అపరిమిత వాయిస్ కాలింగ్, రోజుకు 100 SMS, 24GB డేటాతో వస్తుంది. ఆఫర్‌కు ముందు ఈ ప్లాన్ 336 రోజుల చెల్లుబాటు అందించేది. ఇప్పుడు ఆఫర్ తో మరో 29 రోజుల చెల్లుబాటును ఉచితంగా అందిస్తోంది. ఈ వ్యాలిడిటీతో కలిపి ఈ ప్లాన్‌ 365 రోజులు అవుతుంది. ఈ ప్లాన్‌తో మీకు అపరిమిత టాక్‌టైమ్‌, డేటా ప్రయోజనాన్ని కూడా అందిస్తోంది. ఈ ఆఫర్ మార్చి 31 వరకు మాత్రమే అందుబాటులో ఉంటుంది. 

Post a Comment

0Comments

Post a Comment (0)