విశాఖలో లులూ సంస్థకు భూమి కేటాయింపు !

Telugu Lo Computer
0


ఆంధ్రప్రదేశ్ లో లులూ సంస్థ విశాఖ కేంద్రం గా షాపింగ్ మాల్ - హైపర్ మార్కెట్ల కోసం భూ కేటాయింపులకు ప్రభుత్వం ఆమోద ముద్ర వేసింది. ఏపీఐఐసీ ద్వారా విశాఖలో లులూ గ్రూప్ కోసం భూ కేటాయింపులు చేయాలని ప్రభుత్వం నిర్దేశించింది. ఇందు కోసం నగర నడి బొడ్డున స్థలం ఖరారు చేసింది. లులూ గ్రూప్ సంస్థ విశాఖ నగరంలో అంతర్జాతీయ స్థాయి మాల్ నిర్మాణం పెట్టుబడులకు ఎస్ఐ పీబీలో ఆమోదం లభించింది. తాజాగా జరిగిన మంత్రివర్గ భేటీలో అమరావతి, తిరుపతుల్లోనూ మాల్స్‌ ఏర్పాటు చేయాలని లులు సంస్థను కోరామని, సానుకూలంగా స్పందించిందని సీఎం చంద్రబాబు వెల్లడించారు. అందులో భాగంగా విశాఖ బీచ్ రోడ్​లోని హార్బర్ పార్కులో ఉన్న 13.43 ఎకరాల భూమిని ఏపీఐఐసీకి బదలాయించాలని వీఎంఆర్డీఏకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసిం ది. 2017లోనే విశాఖ బీచ్ రోడ్ లోని హార్బర్ పార్కులో అంతర్జాతీయ కన్వెన్షన్ సెంటర్ ఏర్పాటు కు లులూ గ్రూప్ ముందుకు వచ్చింది. 2023లో లులూ గ్రూప్​కు చేసిన భూకేటాయింపులను గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం రద్దు చేసింది. కాగా, కూటమి ప్రభుత్వం ఏర్పాటు తరువాత మళ్లీ షాపింగ్ మాల్, హైపర్ మార్కెట్​ల నిర్మాణం కోసం లులూ గ్రూప్ ముందుకు వచ్చింది. ముఖ్యమంత్రితో లులు గ్రూప్ ఛైర్మన్ యూసఫ్ అలీ భేటీ అయ్యారు. ఆంధ్రప్రదేశ్​లో ఫుడ్ ప్రాసెసింగ్ రంగంలో పెట్టుబడులపై చర్చించారు. విశాఖలో మాల్, హైపర్‌ మార్కెట్ ఏర్పాటుపై చంద్రబాబుతో వారు చర్చించారు. విజయవాడ, వైజాగ్​, తిరుపతిలో నూ మల్టీప్లెక్స్‌ల ఏర్పాటుపై చర్చ జరిగింది. తిరిగి విశాఖ, తిరుపతిలో సంస్థల ఏర్పాటు పైన సానుకూలంగా స్పందించారు. ఈ మేరకు ఇప్పుడు భూ కేటాయింపుల పైన ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయటంతో.. ఇక, సంస్థ ఏర్పాటు చర్యలు వేగవంతం కానున్నాయి.

Post a Comment

0Comments

Post a Comment (0)