అమెరికా దేశాధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఉక్రెయిన్‌కు చెందిన కౌంటర్‌పార్ట్ వొలొదిమిర్ జెలెన్‌స్కీతో నిర్వహించిన చర్చలు అర్ధాంతరంగా ముగిశాయి. కాల్పుల విరమణ ఒప్పందానికి జెలెన్‌స్కీ అంగీకరించట్లేదనేది వైట్‌హౌస్ వాదన. అది నిజమని నిరూపించేలా వ్యవహరించారు జెలెన్‌స్కీ. డొనాల్డ్ ట్రంప్‌తో ముఖాముఖి భేటీ అనంతరం ఫాక్స్ న్యూస్‌కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో మాట్లాడారు. డొనాల్డ్ ట్రంప్‌కు క్షమాపణ చెప్పడానికి నిరాకరించారు. అమెరికా పర్యటనలో ఉన్న జెలెన్‌స్కీ- వైట్‌హౌస్ ఓవల్ ఆఫీస్‌లో డొనాల్డ్ ట్రంప్‌తో భేటీ అయ్యారు. యుద్ధాన్ని నివారించడమే ఈ అత్యున్నత స్థాయి సమావేశం ప్రధాన అజెండా. ఈ విషయంలో ట్రంప్ చేసిన కొన్ని ప్రతిపాదనలను అంగీకరించలేదు జెలెన్‌స్కీ. కాల్పుల విరమణకు ఒప్పుకోలేదు. ఫలితంగా ఈ ఇద్దరు నేతల మధ్య వాగ్వివాదం చోటు చేసుకుంది. సుదీర్ఘ వాదులట సంభవించింది. ఈ హీటెడ్ డిబేట్ మొత్తం కూడా లైవ్ టెలికాస్ట్ అయింది. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ తరఫున ట్రంప్ వాదిస్తోన్నారనే అభిప్రాయాన్ని పరోక్షంగా జెలెన్‌స్కీ వ్యక్తం చేశారు. మధ్యవర్తిగా రెండు దేశాలకు ప్రయోజనం కలిగించడానికి భిన్నంగా పుతిన్‌కు అనుకూలంగా వ్యవహరిస్తోన్నారనే వాదనను వినిపించారు. ఈ వాగ్వివాదం కారణంగా ఈ భేటీ అర్ధాంతరంగా ముగిసింది. చర్చలు కొనసాగుతున్న దశలోనే జెలెన్‌స్కీ వైట్ హౌస్ నుంచి బయటికి వెళ్లిపోవడం కనిపించింది. ఇందుకు క్షమాపణ చెప్పాలనే డిమాండ్ సైతం తెరమీదికి వచ్చింది. అర్ధాంతంగా ఈ భేటీ నుంచి వెళ్లిపోయిన అనంతరం ఫాక్స్ న్యూస్ ఇంటర్వ్యూలో జెలెన్‌స్కీ ప్రత్యక్షం అయ్యారు. ట్రంప్‌తో భేటీ అంశాన్ని ప్రస్తావించారు. చర్చలు స్నేహపూరక వాతావరణంలో సాగలేదని, దౌత్యపరంగా విఫలం అయ్యాయని తేల్చి చెప్పారు. అమెరికా తన మద్దతును ఉపసంహరించుకుంటే రష్యాను ఎదుర్కొనడం కష్టతరమౌతుందని జెలెన్‌స్కీ అంగీకరించారు. సుహృద్భావ వాతావరణంలో తాను చర్చలను ముగించాలనుకున్నానని, దీనికి భిన్నంగా ఏకపక్షంగా సాగాయని భావిస్తున్నానని వ్యాఖ్యానించారు. డొనాల్డ్ ట్రంప్‌కు క్షమాపణ చెప్పడానికి ఈ సందర్భంగా నిరాకరించారు. అమెరికా అధ్యక్షుడు అన్నా, ఆ దేశ ప్రజలు అన్నా తనకు ఎంతో గౌరవభావం ఉందని, ట్రంప్‌తో చర్చల సందర్భంగా తప్పు చేసినట్లు భావించట్లేదని, అలాంటప్పుడు క్షమాపణ చెప్పే ప్రశ్నే తలెత్తదని వ్యాఖ్యానించారు.
డొనాల్డ్ ట్రంప్‌కు క్షమాపణ చెప్పడానికి నిరాకరించిన జెలెన్‌స్కీ !
March 01, 2025
0
Tags