నిస్సాన్ మాగ్నైట్ అన్ని వేరియంట్‌లపై ధర పెంపు !

Telugu Lo Computer
0

నిస్సాన్ మాగ్నైట్ అన్ని వేరియంట్‌లపై రూ.4,000 ధరను పెంచినట్లు కంపెనీ వెల్లడించింది.  దేశీయ మార్కెట్లో అందుబాటులో ఉన్న సరికొత్త నిస్సాన్ మాగ్నైట్ ఎస్‌యూవీ ధర రూ.6.14 లక్షల నుండి రూ.11.76 లక్షలు ఎక్స్-షోరూమ్ వరకు ఉంది. ఇది విసియా, విసియా ప్లస్, అసెంటా, ఎన్-కనెక్టా, టెక్నా, టెక్నా ప్లస్ అనే 6 వేరియంట్స్‌లో అందుబాటులో ఉంది. ఈ కారు ఎక్ట్సీరియర్‌లో మరింత ఆకర్షణీయమైన డిజైన్‌లో ఉంటుంది. ఇందులో కొత్త ఎల్ఈడీ హెడ్‌ల్యాంప్స్, గ్రిల్, ఎల్ఈడీ టెయిల్ ల్యాంప్స్ ఉన్నాయి. అలానే 16-అంగుళాల డ్యూయల్-టోన్ అల్లాయ్ వీల్స్‌ను కూడా ఉన్నాయి. కొత్త నిస్సాన్ మాగ్నైట్ ఎస్‌యూవీ స్టార్మ్ వైట్, బ్లేడ్ సిల్వర్, సన్‌రైజ్ కూపర్ ఆరెంజ్, ఫ్లేర్ గార్నెట్ రెడ్, ఒనిక్స్ బ్లాక్, పర్ల్ వైట్ కలర్స్‌లో అందుబాటులో ఉంది. కొత్త నిస్సాన్ మాగ్నైట్ ఎస్‌యూవీ1- లీటర్ నాచురల్ ఆస్పిరేటెడ్ పెట్రోల్, 1-లీటర్ టర్బో పెట్రోల్ ఇంజన్‌తో వస్తుంది. ఇందులో 5-స్పీడ్ మ్యాన్యువల్, 5-స్పీడ్ ఆటోమేటిక్, సీవీటీ గేర్‌బాక్స్ ఎంపికలు ఉన్నాయి. 17.4 నుండి 20 kmpl మైలేజీని ఇస్తుంది. ఈ కారులో 5 మంది ప్రయాణించవచ్చు. వారాంతాల్లో, సెలవు దినాల్లో ఎక్కువ లగేజీని తీసుకువెళ్లడానికి 336-లీటర్ సామర్థ్యం గల బూట్ స్పేస్‌ ఉంది. 8-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, 7-అంగుళాల డిజిటల్ డ్రైవర్ డిస్‌ప్లే, ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్‌ప్లే, వైర్‌లెస్ ఫోన్ ఛార్జర్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్‌తో సహా వివిధ ఫీచర్లతో వస్తుంది. భద్రత విషయంలో 6-ఎయిర్‌బ్యాగ్స్, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్, టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్, ప్రయాణీకుల రక్షణ కోసం 360-డిగ్రీ కెమెరా ఉన్నాయి.

Post a Comment

0Comments

Post a Comment (0)