సోదరిపై పరువునష్టం దావా వేసిన శామ్‌ ఆల్ట్‌మన్‌ !

Telugu Lo Computer
0


తనను లైంగికంగా వేధించాడంటూ సోదరి చేసిన ఆరోపణలను ఓపెన్‌ఏఐ సీఈఓ శామ్‌ ఆల్ట్‌మన్‌ ఖండించారు. అవన్నీ తప్పుడు వాదనలన్నారు. ఆమె ఆరోపణలు తన పరువుకు భంగం కలిగించడంతోపాటు ఎంతో మానసిక వేదనకు గురిచేశాయన్నారు. ఈ క్రమంలో ఆమెపై పరువునష్టం దావా వేశారు. 1990 చివర, 2000 దశాబ్దం మొదట్లో.. మిస్సౌరీలో ఉన్న సమయంలో తనను ఆల్ట్‌మన్‌ వేధింపులకు గురిచేశాడని ఆయన సోదరి అన్‌ ఆల్ట్‌మన్‌ ఈ ఏడాది జనవరిలో ఆరోపణలు చేశారు. తాను మూడేళ్ల వయసు ఉన్నప్పటి నుంచి లైంగిక వేధింపులు మొదలయ్యాయని, దాదాపు పదేళ్లపాటు ఇవి కొనసాగాయని చెప్పారు. అప్పుడు శామ్‌ మేజర్‌ అయినప్పటికీ.. తాను మాత్రం మైనర్‌నేనని పేర్కొన్నారు. లైంగికంగా వేధించాడంటూ సోదరి చేసిన ఆరోపణలను ఖండించిన ఆల్ట్‌మన్‌.. న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. ఆమె చేసిన ఆరోపణలు తన ప్రతిష్ఠను దిగజార్చాయని, మానసికంగా ఎంతో వేదనకు గురిచేశాయని తాజా కోర్టు ఫైలింగ్‌లో పేర్కొన్నారు. ఆర్థికసాయాన్ని పొందాలనే కుట్రతో ఆమె తనపై కోర్టులో దావా కూడా వేశారన్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)