పాకిస్తాన్‌లో భూకంపం !

Telugu Lo Computer
0


పాకిస్తాన్‌లోని బలూచిస్తాన్ ప్రాంతంలో సోమవారం 4.6 తీవ్రతతో భూకంపం సంభవించింది. బలూచిస్తాన్‌లోని ఉతల్ నగరానికి తూర్పు-ఆగ్నేయంగా 65 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రం ఉందని యూఎస్జీఎస్ తెలిపింది. భూకంప కేంద్రం 10 కిలోమీటర్ల లోతులో వ్యాపించి ఉందని అధికారులు తెలిపారు. భూకంపం కారణంగా ఆస్తి, ప్రాణ నష్టం జరిగినట్లు ఇంకా తెలియరాలేదు. కరాచీలో కూడా భూకంప ప్రకంపనలు సంభవించాయని కొంతమంది సోషల్ మీడియాలో పేర్కొన్నారు. భూకంప తీవ్రత తక్కువగా ఉండడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. రోజుల వ్యవధిలోనే భూకంపాలు సంభవిస్తుండడంతో ప్రజలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)