ఆంధ్రప్రదేశ్ లోని గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం కొలనుకొండ సమీపంలో మహిళను అత్యంత కిరాతకంగా చంపేశారు. జాతీయ రహదారి సర్వీస్ రోడ్డులో గుంటూరు ఛానల్ పక్కన దాదాపు 30 ఏళ్ల మహిళను రేప్ చేసి, గొంతుకోసి హతమార్చారు. ముళ్ళ పొదల్లో మహిళ మృతదేహం గుర్తించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించడంతో రంగంలోకి దిగి దర్యాప్తు చేస్తున్నట్లు తాడేపల్లి సీఐ కళ్యాణ్ రాజు తెలిపారు. ఈ మేరకు కొలనుకొండ సమీపంలోని స్థానికులు గుర్తుతెలియని మహిళ హత్యకు గురైందని సమాచారం ఇచ్చారు. వెంటనే వెళ్లి పరిశీలించగా మహిళను అత్యాచారం చేసి దారుణంగా మెడపై కత్తితో పొడిచి చంపేసినట్లు ఆనవాళ్లు లభించాయి. మృతదేహం వద్ద కండోమ్ ప్యాకెట్స్, తదితర వస్తువులు దొరికాయి. ఆమె సెల్ ఫోన్ కూడా గుర్తించాం. దాని ఆధారంగా వివరాలు సేకరిస్తాం. ప్రస్తుతం ఆమె ఎవరు? ఎక్కడి నుంచి వచ్చింది? అనేది వివరాలు తెలియాల్సి ఉందని సీఐ తెలిపారు.
కొలనుకొండలో మహిళ దారుణ హత్య!
March 24, 2025
0
Tags