భూమి పైకి చేరిన సునీత విలియమ్స్, బుచ్ విల్మోర్ !

Telugu Lo Computer
0


సునీత విలియమ్స్, బుచ్ విల్మోర్ ఎట్టకేలకు భూమికి తిరిగి వచ్చారు. ఫ్లోరిడా పాన్‌హ్యాండిల్‌లోని గల్ఫ్ ఆఫ్ మెక్సికోలో డ్రాగన్ క్యాప్సూల్ నుంచి సురక్షితంగా బయటకు వచ్చారు. దాదాపు 9 నెలల తర్వాత నాసా క్రూ-9 వ్యోమగాములు సునీతా విలియమ్స్, నిక్ హేగ్, బుచ్ విల్మోర్, రష్యన్ వ్యోమగామి అలెగ్జాండర్ గోర్బునోవ్ భూమి గురుత్వాకర్షణను మొదటిసారిగా అనుభవించారు. భూమిపై గాలిని పీలుస్తూ ఆనందం వ్యక్తం చేశారు. స్పేస్‌ఎక్స్ క్యాప్సూల్ ఫ్లోరిడా పాన్‌హ్యాండిల్ నుంచి మెక్సికో గల్ఫ్‌లోకి పారాచూట్ ద్వారా ల్యాండ్ అయింది. స్ప్లాష్ డౌన్ తరువాత భద్రతా బృందం క్రాఫ్ట్‌ను రికవరీ షిప్‌లోకి ఎత్తి హాచ్ తెరిచింది. డ్రాగన్ క్యాప్సూల్ నుంచి వ్యోమగాముల బయటకు తీసుకువచ్చారు. ఈ సందర్భంగా సునీత విలియమ్స్ భూమి గురుత్వాకర్షణను మొదటిసారిగా ఫీలయ్యారు.

Post a Comment

0Comments

Post a Comment (0)