మహాకుంభమేళాను విమర్శిస్తూ పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ చేసిన వ్యాఖ్యలపై యూపీ సీఎం యోగీ ఆదిత్యనాథ్ తీవ్ర విమర్శలు గుప్పించారు. హోలీ సమయంలో హింస ను నియంత్రించలేని వారు మహాకుంభమేళాను మృత్యుకుంభ్ అని పిలవడం విడ్డూరంగా ఉందన్నారు. గోరఖ్ పూర్ లో ఆదివారం జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు. తొలిసారిగా తమిళనాడు నుంచి ప్రజలు మహా కుంభమేళాకు భారీగా తరలి వచ్చారని గుర్తు చేశారు. కేరళ నుంచి కూడా ప్రజలు ప్రయాగ రాజ్కు పోటెత్తారని తెలిపారు. ‘ఉత్తరప్రదేశ్ జనాభా 25 కోట్లు. ఈ రాష్ట్రంలో హోలీ ప్రశాంతంగా ముగిసింది. కానీ పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో మాత్రం హోలీ సమయంలో అనేక అవాంతరాలు జరిగాయి. ప్రభుత్వం వీటిని నియంత్రించకపోవడం విడ్డూరంగా ఉంది’ అని తెలిపారు. 45 రోజుల పాటు జరిగే మహా కుంభమేళాల్లో ప్రతిరోజూ పశ్చిమ బెంగాల్ నుంచి 50,000 నుండి 1. లక్ష మంది వరకు పాల్గొన్నారన్నారు. గవర్నర్లు, ముఖ్యమంత్రులను మహా కుంభ్ కి ఆహ్వానించడానికి తమ ప్రభుత్వం కొన్ని రాష్ట్రాలకు మంత్రులను పంపిందని చెప్పారు. కాగా, పశ్చిమ బెంగాల్లోని ఉత్తర 24 పరగణాల జిల్లాలో హోలీ సందర్భంగా జరిగిన ఘర్షణలో 20 ఏళ్ల యువకుడు ప్రాణాలు కోల్పోయాడు. దీంతో రాష్ట్రంలో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి.
మమత బెనర్జీ వ్యాఖ్యలపై యోగీ ఆదిత్యనాథ్ ఆగ్రహం
March 16, 2025
0
Tags