అమెజాన్ కొత్త తరహా ఫీజు వసూలు చేయడం మొదలుపెట్టింది. డిస్కౌంట్లపై ఏదైనా వస్తువు కొనుగోలు చేసినప్పుడు దానిపై రూ.49 చొప్పున ప్రాసెసింగ్ ఫీజు వసూలు చేస్తోంది. ఇన్‌స్టంట్ డిస్కౌంట్ రూ.500 దాటినప్పుడు మాత్రమే ఈ మొత్తం వసూలు చేస్తోంది. అంతకంటే తక్కువ ఉన్న సందర్భాల్లో ఈ ఫీజు నుంచి మినహాయిస్తోంది. మరో ఇ-కామర్స్ సంస్థ ఫ్లిప్‌కార్ట్ ఇప్పటికే ఈ తరహా ఫీజు వసూలు చేస్తోంది. ఇప్పుడు అమెజాన్ కూడా దీనికి శ్రీకారం చుట్టింది. ఉదాహరణకు మీరు రూ.10 వేలు విలువైన వస్తువును కొనుగోలు చేశారనుకుందాం. బ్యాంక్ ద్వారా మీకు వెయ్యి రూపాయలు డిస్కౌంట్ లభిస్తే వాస్తవంగా రూ.9 వేలు చెల్లించాల్సి ఉంటుంది. కానీ, రూ.49 ప్రాసెసింగ్ ఫీజు కలుపుకొంటే డిస్కౌంట్ తర్వాత ధర రూ.9049 చెల్లించాల్సి ఉంటుంది. బ్యాంక్ ఆఫర్లను మేనేజ్ చేసేందుకు, ప్రాసెసింగ్ చేసేందుకు ఈ ఫీజు ఉపయోగపడుతుందని అమెజాన్ చెబుతోంది. రూ.500 డిస్కౌంట్ దాటిన ప్రతి ఒక్కరికీ ఈ ఫీజు వర్తిస్తుంది. ఒకవేళ మీరు ఆర్డర్ చేసిన వస్తువు రిటర్న్ చేయాల్సి వస్తే ఈ ఫీజు తిరిగి రాదు. బ్యాంక్ ఆఫర్‌తో పాటు నో-కాస్ట్ ఈఎంఐకీ ఈ ఫీజు వర్తిస్తుంది. ప్రైమ్ యూజర్లు ఇందుకు మినహాయింపు కాదు. ఇప్పటికే యూజర్ల నుంచి ఈ ఫీజు వసూలును ప్రారంభించింది.
ఇన్‌స్టంట్ డిస్కౌంట్ కొనుగోళ్లపై అమెజాన్‌లో ప్రాసెసింగ్ ఫీజు
March 21, 2025
0
Tags