ప్రముఖ గాయని కల్పన నిద్రమాత్రలు మింగి ఆత్మహత్యా యత్నానికి పాల్పడ్డారు. ఆమెను ఆసుపత్రిలో చేర్చి చికిత్స అందిస్తున్నారు. ఎన్నో సూపర్ హిట్ పాటలు పాడిన కల్పన, డబ్బింగ్ ఆర్టిస్ట్ గా, నటిగా కూడా గుర్తింపు పొందారు. ఆమెకు గతంలోనూ ఆర్థిక ఇబ్బందుల వల్ల ఆత్మహత్య చేసుకోవాలనే ఆలోచన వచ్చిందని, గాయని చిత్ర ధైర్యం చెప్పడంతో ఆగిపోయానని తెలిపారు. నిజాంపేటలోని ఆమె ఇంట్లో ఒంటరిగా ఉంటున్న కల్పన, రెండు రోజులుగా తలుపు తీయకపోవడంతో స్థానికులు ఆమె భర్త ప్రసాద్‌కు సమాచారం అందించారు. ప్రసాద్ చెన్నై నుండి వచ్చి తలుపులు పగలగొట్టి చూడగా కల్పన స్పృహ లేకుండా పడి ఉన్నారు. ప్రస్తుతం పోలీసులు ఆమె భర్త ప్రసాద్‌ను విచారిస్తున్నారు. ఆయన రెండు రోజులుగా తాను ఇంట్లో లేనని సమాధానమిచ్చారు. దీంతో ఇంట్లో ఒంటరిగా ఉంటున్న కల్పన.. ఎందుకిలా ఆత్మహత్యకు పాల్పడింది అనే విషయం ఇంకా తెలియాల్సి ఉంది.. అయితే తాజాగా ఆమె హెల్త్ అప్డేట్ ను డాక్టర్లు వెల్లడించారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్యం నిలకడగానే ఉందని తెలిపారు. త్వరలోనే కోలుకుంటుందని అంటున్నారు.
గాయని కల్పన ఆత్మహత్యా యత్నం
March 05, 2025
0
Tags