నల్గొండ జిల్లా బీబీగూడెం వద్ద ఆర్టీసీ బస్సును ఢీకొట్టిన కారు : నలుగురు మృతి

Telugu Lo Computer
0

తెలంగాణలోని నల్గొండ జిల్లా చివ్వెంల మండలం బీబీగూడెం వద్ద ఆర్టీసీ బస్సును కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో నలుగురు అక్కడిక్కడే ప్రాణాలు కోల్పోయారు.  మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. స్థానికుల నుంచి ప్రమాద వివరాలు తెలుసుకున్నారు. మృతదేహాలను పోస్టుమార్టంకు తరలించారు. మృతుల కుటుంబ సభ్యులకు సమాచారం అందజేశారు. ప్రమాదంతో రోడ్డుపై నిలిచిపోయిన ట్రాఫిక్ను క్లియర్ చేశారు. ఘటనకు అతివేగమే కారణమని అంచనా వేస్తున్నారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 

Post a Comment

0Comments

Post a Comment (0)