తమిళిసై సౌందరరాజన్ అరెస్టు !

Telugu Lo Computer
0


తమిళనాడులో త్రిభాషా విధానానికి మద్దతుగా బీజేపీ సంతకాల సేకరణ ప్రారంభించింది. ఈ నేపథ్యంలో పోలీసులు ఆ పార్టీ నేతలను అడ్డుకున్నారు. ఈ క్రమంలోనే బీజేపీ నాయకురాలు తమిళిసై సౌందరరాజన్‌ను అరెస్టు చేశారు. తమిళనాడులో త్రిభాషా విధానానికి మద్దతుగా బుధవారం బీజేపీ ఇంటింటా సంతకాల సేకరణ, ప్రచార, అవగాహన కార్యక్రమం చేపట్టిన విషయం తెలిసిందే. అలాగే డీఎంకే అఖిల పక్ష సమావేశాన్ని కూడా బహిష్కరిస్తూ నిర్ణయం తీసుకుంది. కేంద్రం తీసుకొచ్చిన జాతీయ విద్యా విధానం 2020 ప్రకారం మూడు భాషల విధానానికి మద్దతుగా బీజేపీ నేతలు ఈ నిర్ణయం తీసుకున్నారు. ప్రజా వ్యతిరేక, అవినీతి విధానాలు, దుష్ర్పవర్తన, శాంతిభద్రతల వైఫల్యం గురించి చర్చించారు. రాబోయే రోజుల్లో తమిళనాడు ప్రజల సంక్షేమం, డీఎంకే ప్రభుత్వ విధానాలను నిలదీసే విధంగా కార్యక్రమాలు చేప్టటాలని నిర్ణయం తీసుకున్నారు. ఇదిలాఉండగా.. జాతీయ విద్యా విధానం పేరుతో కేంద్రం తమపై హిందీ భాషను బలవంతంగా రుద్దేందుకు యత్నిస్తున్నారని సీఎం స్టాలిన్ ఆరోపించిన సంగతి తెలిసిందే. హిందీ వల్ల దేశంలో 25 ప్రాంతీయ భాషలు కనుమరుగైపోయాయని తెలిపారు. అందుకే తాము జాతీయ విద్యా విధానాన్ని వ్యతిరేకిస్తున్నామని స్పష్టం చేశారు. 

Post a Comment

0Comments

Post a Comment (0)