విజయమ్మ, షర్మిల షేర్ల బదిలీని రద్దు చేయండి : ఎన్‌సీఎల్‌టీలో జగన్‌ పిటిషన్‌

Telugu Lo Computer
0


తన పేరు మీద, వైఎస్‌ భారతి పేరు మీద ఉన్న షేర్లను తల్లి విజయమ్మ, చెల్లెలు షర్మిల అక్రమంగా బదిలీ చేసుకున్నారని వైకాపా అధినేత జగన్‌ జాతీయ కంపెనీ లా టైబ్య్రునల్‌ (ఎన్‌సీఎల్‌టీ)లో పిటిషన్‌ దాఖలు చేశారు. కనీసం తన సంతకాలు లేకుండా షేర్ల బదిలీ జరిగిందని తెలిపారు. విజయమ్మ, షర్మిల, సండూర్‌ పవర్‌, రిజిస్ట్రార్‌ ఆఫ్‌ కంపెనీస్‌ను ప్రతివాదులుగా పేర్కొన్నారు. బదిలీ చేసుకున్న షేర్లపై స్టే విధించాలని గత వారం జగన్... మధ్యంతర పిటిషన్‌ దాఖలు చేశారు. తాజా పిటిషన్‌తో పాటు.. మధ్యంతర పిటిషన్లపైనా కౌంటర్‌లు దాఖలు చేయడానికి వాద, ప్రతివాదులు గడువు కోరడంతో తదుపరి విచారణను వచ్చే నెల 3కి వాయిదా పడింది.

Post a Comment

0Comments

Post a Comment (0)