ప్రపంచ వ్యాప్తంగా సోమవారం నుంచి 'ఎక్స్' ట్విట్టర్ సేవల్లో అంతరాయం ఏర్పడింది. ఈ నేపథ్యంలో దాదాపుగా ఇప్పటికే 40 వేల మందికిపైగా ఫిర్యాదులు వెళ్లాయి. ఇదిలా ఉంటే మంగళవారం కూడా అదే అంతరాయం కొనసాగుతోంది. ప్రస్తుతం పదే పదే క్రాష్ అవుతోంది. అంతరాయంపై 'ఎక్స్' యాజమాని ఎలాన్ మస్క్ స్పందించారు. ఎక్స్‌పై సైబర్ దాడి జరిగిందని, దీనికి ఉక్రెయినే కారణమని ఆరోపణలు చేశారు. ఉక్రెయిన్‌కు సంబంధించిన ఐపీ అడ్రస్‌లు కనుగొన్నట్లు తెలిపారు. ఉక్రెయిన్ ప్రాంతం నుంచే ఈ సైబర్ దాడి జరిగినట్లుగా గుర్తించినట్లు చెప్పారు. అయితే ఈ సైబర్ దాడికి పాలస్తీనా అనుకూల హ్యాకర్ గ్రూప్ బాధ్యత వహించింది. పాలస్తీనా అనుకూల సంస్థ డార్క్ స్టార్మ్ టీం బాధ్యత వహించింది. పాలస్తీనా అనుకూల గ్రూప్ బాధ్యత వహించినప్పటికీ.. దీనికి మూలం మాత్రం ఉక్రెయినే కారణంగా ప్రశ్నలు తలెత్తుతున్నాయని మస్క్ పేర్కొన్నారు. ''ఏం జరిగిందో కచ్చితంగా తెలియదు గానీ.. ఉక్రెయిన్ ప్రాంతానికి సంబంధించిన ఐపీ చిరునామాలతో ఎక్స్ వ్యవస్థను కూల్చేసేందుకు భారీ సైబర్ దాడి జరిగింది.'' అని మస్క్ ఆరోపించారు.
ప్రపంచ వ్యాప్తంగా నుంచి 'ఎక్స్' (ట్విట్టర్) సేవల్లో అంతరాయం !
March 11, 2025
0
Tags