పెన్నహోబిలం హుండీలో నగల మూట చోరీ యత్నం !

Telugu Lo Computer
0


ఆంధ్రప్రదేశ్ లోని  అనంతపురం జిల్లా ఉరవకొండ మండలంలోని పెన్నహోబిలం లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో నగల మూట చోరీ యత్నం కలకలం రేపింది. డిసెంబరు 7న ఆలయంలో మొక్కు తీర్చుకోవటానికి వేలూరు రంగయ్య దంపతులు వెళ్లారు. రంగయ్య తన భార్యకు ఉన్న రూ.8 లక్షల విలువైన ఆభరణాలు మూట కట్టి ఆలయ హుండీలో వేశారు. ఈనెల 18న ఆలయ ఈవో రమేశ్‌ ఆధ్వర్యంలో హుండీ లెక్కింపు చేపట్టారు. హుండీ లెక్కింపు సమయంలో సిబ్బంది నగల మూటను దాచిపెట్టారు. లెక్కింపు పూర్తయ్యాక నగలను అధికారులు, సిబ్బంది పంచుకోవటానికి వ్యూహరచన చేశారు. అయితే, పంపకాల్లో తేడాలు రావటంతో కథ అడ్డం తిరిగింది. ఆలయ పూజారి ఎదుటే రంగయ్య దంపతులు హుండీలో నగల మూట వేయటం, లెక్కింపు సమయంలో కనిపించకపోవడంతో విషయం బయటకు పొక్కింది. ఈ నేపథ్యంలో అధికారి, సిబ్బంది నిన్న రాత్రి తిరిగి నగల మూటను హుండీలో వేశారు. ఈ ఘటనపై దేవాదాయశాఖ ఉన్నతాధికారులు సమగ్ర వివచారణ జరిపించాలని భక్తులు డిమాండు చేస్తున్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)