నాగబాబు నామినేషన్ దాఖలు !

Telugu Lo Computer
0


ఆంధ్రప్రదేశ్ ఎమ్మెల్యే కోటా జనసేన ఎమ్మెల్సీ అభ్యర్థిగా కొణిదల నాగబాబు  నామినేషన్ దాఖలు చేశారు. నాగబాబు అభ్యర్థిత్వాన్ని మంత్రి నారా లోకేష్, ఏపీ టీడీపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్, బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు బలపరిచారు. నాగబాబు మంత్రి అవుతారా? లేదా? అన్న అంశం ఏపీ పాలిటిక్స్ లో హాట్ టాపిక్ గా మారింది. గతంలో నాగబాబును మంత్రివర్గంలోకి తీసుకుంటామని సీఎం చంద్రబాబు స్వయంగా ప్రకటన విడుదల చేశారు. దీంతో ఆయన ఎమ్మెల్సీగా ఎన్నిక అయిన వెంటనే మంత్రివర్గంలోకి రావడం పక్కా అన్న ప్రచారం సాగింది. అయితే మంత్రి పదవి చేపట్టేందుకు నాగబాబు ఆసక్తి చూపడం లేదని కొన్ని రోజులుగా వార్తలు వస్తున్నాయి. అసలు రాజ్యసభకు వెళ్తాన్న ప్రచారం కూడా జరిగింది. కానీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా నాగబాబు పేరును ఖరారు చేస్తూ జనసేన అధికార ప్రకటన విడుదల చేయడంతో రాజ్యసభ వార్తలకు ఫుల్ స్టాప్ పడింది. అయితే.. మంత్రి పదవిపై మాత్రం ఇంకా సస్పెన్స్ వీడ లేదు. మరికొన్ని రోజుల్లో ఈ అంశంపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.

Post a Comment

0Comments

Post a Comment (0)