ప్రముఖ సంగీత విద్వాంసుడు గరిమెళ్ళ కన్నుమూత ?

Telugu Lo Computer
0

ప్రముఖ సంగీత విద్వాంసుడు, తిరుమల తిరుపతి దేవస్థానం మాజీ ఆస్థాన గాయకుడు గరిమెళ్ళ బాలకృష్ణ ప్రసాద్ (76) గుండెపోటుతో తిరుపతి లోని స్వగృహంలో ఆయన తుదిశ్వాస విడిచారు. ఈయన వెయ్యికి పైగా అన్నమాచార్య సంకీర్తనలకు స్వర కల్పన చేశారు. తిరుమల తిరుపతి దేవస్థానంలో 1978 నుంచి 2006 వరకు గరిమెళ్ల ఆస్థాన గాయకుడిగా ఉన్నారు. గరిమెళ్ళ బాలకృష్ణ వినరో భాగ్యము విష్ణు కథ, జగడపు చనువుల జాజర, పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు వంటి సుప్రసిద్ధ కీర్తనలకు స్వరాలు సమకూర్చారు. సంప్రదాయ కర్ణాటక సంగీతంలో లలిత సంగీతంలో జానపద సంగీతంలోనూ పాట పాడారు. ఈయన భౌతిక దేహానికి టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి నివాళులర్పించారు. 

Post a Comment

0Comments

Post a Comment (0)