వైసీపీకి గుడ్‌బై చెప్పనున్న ధర్మాన, తమ్మినేని ?

Telugu Lo Computer
0


శ్రీకాకుళం జిల్లాకు చెందిన మాజీ మంత్రులు ధర్మాన ప్రసాదరావు, మాజీ స్పీకర్‌ తమ్మినేని సీతారామ్‌ వైసీపీకి వీడేందుకు రెడీ అయ్యారని ప్రచారం సాగుతోంది. గత వైసీపీ ప్రభుత్వంలో ధర్మాన ప్రసాదరావు మంత్రిగా ఓ వెలుగు వెలిగారు. ఆయన కీలక శాఖలను నిర్వహించారు. మరోవైపు తమ్మినేని సీతారామ్‌ కూడా స్పీకర్‌గా జగన్‌కు అన్ని విధాల అండగా నిలిచారు. కానీ గత అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత ఈ ఇద్దరు నేతలు ఒక్కసారిగా సైలెంట్‌ అయ్యారు. మాజీ మంత్రి ధర్మాన ప్రసాద రావు కొద్దిరోజులుగా వైసీపీతో అంటిముట్టనట్టు వ్యవహరిస్తున్నారు. గత వైసీపీ ప్రభుత్వంలో మంత్రిగా సేవలందించిన ధర్మాన ప్రసాద రావు ఇప్పుడు పార్టీ కార్యక్రమాలకు దూరం పాటిస్తున్నారు. అప్పట్లో ఎన్నికల్లో ఓటమి నుంచి తేరుకోలేదు.. ఆ కారణంగానే పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారని అంతా భావించారు. కానీ ఎన్నికలు ముగిసి దాదాపు ఏడాది కావొస్తున్న ఆయన మౌన వ్రతం వీడటం లేదు. ఇటీవల సిక్కోలు నేతలతో వైఎస్‌ జగన్ సమావేశం నిర్వహించారు. ఆ తర్వాత ఉత్తరాంధ్ర రీజినల్ కో ఆర్డినేటర్ బాధ్యతలను మాజీమంత్రి కన్నబాబుకు అప్పగించారు. ఆయన బాధ్యతలు స్వీకరించగానే ఉత్తరాంధ్ర నేతలందరితో వరుస భేటీలు నిర్వహించారు. ఈ సమావేశానికి సైతం ధర్మాన డుమ్మా కొట్టారు. దాంతో ఆయన ఇకమీదట కూడా పార్టీ కార్యక్రమాలకు రాకపోవచ్చనే టాక్ వినిపిస్తోంది. మరోవైపు తమ్మినేని సీతారామ్‌ కూడా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. ఇటీవల అముదాలవలస వైసీపీ ఇంచార్జ్‌గా చింతాడ రవికుమార్‌కు బాధ్యతలు అప్పగించారు. దాంతో నారజ్‌ అయినా తమ్మినేని పార్టీ కార్యక్రమాల్లో అస్సలు పాల్గొనడం లేదు. సిక్కోలు రాజకీయాల్లో దాదాపు మూడు, నాలుగు దశాబ్ధాలుగా కీలకపాత్ర పోషించినా తమ్మినేనిని ఉన్నపళంగా ఇంచార్జ్‌ బాధ్యతల నుంచి తప్పించడంతో ఆయన తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నట్టు ప్రచారం సాగుతోంది. అయితే ఇప్పుడు ఈ ఇద్దరు నేతలు బీజేపీతో టచ్‌లోకి వెళ్లినట్టు ప్రచారం సాగుతోంది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో మరింత విస్తరించేందుకు బీజేపీ పావులు కదుపుతోంది. ఈ నేపథ్యంలో సిక్కోలు లీడర్లు కమలం పార్టీలోకి టచ్‌లోకి వెళ్లారట. దాంతో వారిని చేర్చుకునేందుకు పార్టీ హైకమాండ్‌ గ్రీన్ సిగ్నల్‌ ఇచ్చినట్టు సమాచారం. పార్టీలో చేరికపై ఇప్పటికే పార్టీ చీఫ్‌ పురంధేశ్వరి వీరితో చర్చలు కూడా పూర్తి చేసినట్టు సమాచారం. అయితే గతంలో వైఎస్ జగన్‌కు వీరవిదేయులుగా ఉన్న ఈ ఇద్దరు నేతలు.. ఇప్పుడు.. సడెన్‌గా పార్టీ మారాలనే నిర్ణయం వెనుక.. మాజీఎంపీ విజయసాయిరెడ్డి ఉన్నట్టు ప్రచారం సాగుతోంది. ఇటీవలే వైసీపీకి రాజీనామా చేసిన విజయసాయిరెడ్డి..త్వరలోనే కమలం పార్టీ కండువా కప్పుకుంటారని అంటున్నారు. ఆయనతో పాటు ఈ ఇద్దరు నేతలు కూడా కమలం పార్టీలో చేరుతారని చెబుతున్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)