చెన్నైలో అప్పుల బాధతో డాక్టర్ కుటుంబం ఆత్మహత్య

Telugu Lo Computer
0


చెన్నైలో అప్పుల బాధతో డాక్టరు కుటుంబం ఆత్మహత్య చేసుకుంది. అన్నానగర్, తిరుమంగళం పరిధిలోని 17వ క్రాస్‌ స్ట్రీట్‌లోని బహుళ అంతస్తుల భవనంలోని ఓ ప్లాట్‌లో డాక్టర్‌ బాలమురుగన్‌ (52) కుటుంబం నివాసిస్తూ వచ్చింది. ఆయన భార్య సుమతి (47) హైకోర్టులో న్యాయవాది. ఈ దంపతులకు జశ్వంత్‌కుమార్‌ (19), లింగేశ్‌కుమార్‌ (17) కుమారులు. పెద్దవాడు ప్లస్‌-2 ముగించి డాక్టరు కావాలన్న కలతో నీట్‌కు సిద్ధమవుతున్నాడు. రెండవ వాడు పదో తరగతి పరీక్షలకు సిద్ధమయ్యాడు. బాల మురుగన్‌కు పలు చోట్ల స్కాన్‌ సెంటర్లు ఉన్నాయి. గురువారం ఉదయం బాలమురుగన్‌ డ్రైవర్‌ విజయ్‌ ఇంటికి వచ్చి తలుపు తట్టాడు. ఎంతకు డాక్టర్‌ తెరవక పోవడంతో పక్కన ఉన్న ప్లాట్‌ల వారి సహకారంతో వారి బంధువులకు సమాచారం అందించాడు. వారు తిరుమంగళం పోలీసులకు సమాచారం ఇచ్చారు. బంధువులు, పోలీసులు ఆ ప్లాట్‌కు చేరుకుని తలుపు పగల కొట్టి వెళ్లి చూడగా ఓ గదిలో ఒకే ఫ్యాన్‌కు సుమతి, చిన్న కుమారుడు లింగేశ్వర్‌ ఉరివేసుకుని మృత దేహాలుగా బయటపడ్డారు. మరో గదిలో వేర్వేరు ఫ్యాన్‌లకు బాల మురుగన్, పెద్దకుమారుడు జశ్వంత్‌కుమార్‌ మృతదేహాలుగా వేలాడుతుండటంతో కలకలం రేగింది. వీరి ఆత్మహత్య సమాచారంతో ఆ పరిసరాలలో తీవ్ర విషాదం నెలకొంది. 

Post a Comment

0Comments

Post a Comment (0)