ఫిరంగిపురంలో ఆరేళ్ల చిన్నారిని చంపిన సవతి తల్లి !

Telugu Lo Computer
0


ఆంధ్రప్రదేశ్ లోని గుంటూరు జిల్లా ఫిరంగిపురంలో అమానవీయ ఘటన చోటుచేసుకుంది. మొదటి భార్య సంతానమైన కవలలను రెండో భార్య తీవ్రంగా హింసించింది. ఆరేళ్ల చిన్న కుమారుడిని చంపేసింది. ఎడ్లపాడు మండలం కొండవీడు గ్రామానికి చెందిన కంచర్ల సాగర్‌కు గతంలో వివాహం జరిగింది. ఆయనకు ఇద్దరు కవల కుమారులు ఉన్నారు. రెండేళ్ల క్రితం మొదటి భార్య చనిపోవడంతో ఫిరంగిపురానికి చెందిన లక్ష్మిని సాగర్‌ రెండో పెళ్లి చేసుకున్నారు. ఎనిమిది నెలల క్రితం ఆమె ఆడబిడ్డకు జన్మనిచ్చింది. మొదటి భార్య పిల్లలను లక్ష్మి రోజూ చిత్రహింసలకు గురిచేసేది. బెల్టు, కర్రతో విపరీతంగా గాయపరిచేది. తాజాగా దారుణంగా హింసిస్తూ చిన్న కుమారుడు కార్తిక్‌ తలపై కర్రతో కొట్టింది. ఆపై గొంతు నులిమి బాలుడిని చంపేసింది. పెద్దకుమారుడు ఆకాశ్‌ను పొయ్యిమీద కాలుతున్న అట్ల పెనంపై కూర్చోబెట్టి కాల్చింది. చిన్నారులకు రెండో భార్య పెట్టిన చిత్రహింసలకు సాగర్‌ సహకరించినట్లు సమాచారం. గోశాల విజయ అనే మహిళ ఫిర్యాదు మేరకు ఫిరంగిపురం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. 

Post a Comment

0Comments

Post a Comment (0)